కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై శనివారం నాడు సిబిఐ వాదనలు వినిపించింది. శుక్రవారం నాడు అవినాష్ తరపు లాయర్, సునీత తరపు లాయర్ వాదనలను తెలంగాణ హైకోర్టు విన్న సంగతి తెలిసిందే. శనివారం నాడు సిబిఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు. అవినాష్ కు ముందస్తు బేయిలు ఇవ్వద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.
Advertisement
అవినాష్ ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు సహకరించడం లేదని… ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన అవినాష్ రెడ్డి పట్టించుకోవడంలేదని కోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తులో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని సిబిఐ వెల్లడించింది. దర్యాప్తు తమ పద్ధతి ప్రకారం చేస్తాం కానీ అవినాష్ కోరుకున్నట్లు కాదని సిబిఐ తరపు లాయర్ అనిల్ కోర్టుకు స్పష్టం చేశారు.
Advertisement
ఈ తరుణంలోనే…ఎంపీ అవినాష్ రెడ్డికి టీఎస్ హైకోర్టులో ఊరట లభించింది. బుధవారం వెల్లడిస్తామని ప్రకటించింది. నిన్న అవినాష్, సునీత తరపు లాయర్ల వాదనలు విన్నకోర్టు… ఇవాళ సిబిఐ తరపు లాయర్ వాదనలు ఆలకించింది. దీంతో తుది తీర్పు బుధవారం చెబుతామని కోర్టు తెలిపింది. అయితే అప్పటివరకు అవినాష్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సిబిఐని ఆదేశించాలని ఆయన తరపు లాయర్ కోరారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?
Avika Gor : ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న బ్యూటీ
RRR Movie : ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం