Telugu News » బ‌న్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. పుష్ప మూవీ 5 వ షో కు అనుమతి

బ‌న్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. పుష్ప మూవీ 5 వ షో కు అనుమతి

by Bunty
Ad

పుష్ప సినిమా అభిమానుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పుష్ప మూవీ 5 వ షో కు అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ. ఈ నేప‌థ్యంలోనే… 5 వ షో కి అధికారికంగా అనుమతి జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు… డిసెంబ‌ర్ 17 వ తేదీ నుంచి ఈ నెల 30 వ తేదీ వ‌ర‌కు ఈ 5 వ షో కు అనుమతి ఇచ్చింది.

Advertisement

Pushpa

Advertisement

ఈ మేర‌కు జీవో జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇక ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న పుష్ప సినిమా ను ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌శ్మిక మంద‌నా న‌టిస్తుంది. అలాగే.. స‌మంత ఐటెం సాంగ్ లో న‌టిస్తుంది.

Visitors Are Also Reading