Home » తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఈసారి బ‌డ్జెట్ ఏవిధంగా అంటే..?

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఈసారి బ‌డ్జెట్ ఏవిధంగా అంటే..?

by Anji
Ad

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇదివ‌ర‌కు ఎన్న‌డూ లేని విధంగా ఈసారి బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. మార్చి 07వ తేదీ నుండి రాష్ట్ర శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉండ‌బోదు అని, సీఎం కేసీఆర్ ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నార‌ని అధికార వ‌ర్గాల స‌మాచారం.

 

Advertisement

రాష్ట్ర బ‌డ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6న సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వన్‌లో రాష్ట్ర క్యాబినెట్ స‌మావేశం జ‌రుగ‌నున్న‌ది. మార్చి 7 నుండి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతాయి. స‌మావేశాల‌లో భాగంగా విధిగా వ‌స్తున్న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా నేరుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడ‌తార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. స‌భ ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌నే దానిపై బీఏసీ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు.

Advertisement

తాజాగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై సీఎం కేసీఆర్ నిర్ణ‌యం సంచ‌ల‌న రేకెత్తిస్తోంది. ఈ విధానం ఇప్పుడు కొత్త ఏమి కాద‌ని, గ‌తంలో కూడా ఇలా జ‌రిగింద‌ని గుర్తు చేస్తున్నారు. 2014 ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్రప‌తి పాల‌న విధించారు. ఆ స‌మ‌యంలో అసెంబ్లీ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే స‌మావేశాలు నిర్వ‌హించారు. అదేవిధంగా 1970లో కూడా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించిన దాఖ‌లాల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. మ‌న రాష్ట్రంలోనే కాకుండా ప‌శ్చిమ‌బెంగాల్‌లో కూడా ఇలాంటి ప‌రిస్థితి చోటు చేసుకున్న‌ది. 2021లో ప‌శ్చిమ‌బెంగాల్లో బ‌డ్జెట్ స‌మావేశాల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌లేదు. ఇదే పాల‌సీని ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం ఫాలో అవుతుంది. చూడాలి మ‌రి ఏమి జ‌రుగుతుందో.

Also Read :  అక్కినేని బ్యాగ్రౌండ్ ఉన్నా నాగ‌చైత‌న్య స్టార్ హీరో కాక‌పోవ‌డానికి 10 కార‌ణాలు ఇవే..!

Visitors Are Also Reading