Home » అక్కినేని బ్యాగ్రౌండ్ ఉన్నా నాగ‌చైత‌న్య స్టార్ హీరో కాక‌పోవ‌డానికి 10 కార‌ణాలు ఇవే..!

అక్కినేని బ్యాగ్రౌండ్ ఉన్నా నాగ‌చైత‌న్య స్టార్ హీరో కాక‌పోవ‌డానికి 10 కార‌ణాలు ఇవే..!

by AJAY
Ad

టాలీవుడ్ లో ప‌లువురు సీనియ‌ర్ స్టార్ హీరోల కొడుకులు స్టార్ హీరోలుగా రానిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ నాగార్జున ఇద్ద‌రు కుమారులు కూడా స్టార్ హీరో స్టేట‌స్ ను అందుకోవ‌డంలో వెక‌ప‌డ్డారు. ముఖ్యంగా నాగ‌చైత‌న్య ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ స్టార్ హీరో స్టేట‌స్ ను సంపాదించుకోలేక‌పోయారు.

Advertisement

అయితే చైతూ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోక‌పోవ‌డానికి కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. చైతూ మొద‌టి సినిమా జోష్ ఎన్నో అంచ‌నాల మధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ALSO READ : BIGG BOSS OTT : ముమైత్ ఖాన్ నా చెయ్యి విర‌గొట్టింది..శ్రీరాపాక సెన్సేష‌న‌ల్ కామెంట్స్…!

Nagachaitanya

Nagachaitanya

కానీ ఈ సినిమాలో హీరోయిన్ తో పాటూ మ‌రికొన్ని అంశాలు సినిమాను దెబ్బ కొట్టాయి. అంతే కాకుండా ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్లు ఉన్నా అవి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేదు. ఇక ఈ సినిమా త‌ర‌వాత నాగ‌చైత‌న్య ల‌వ్ రొమాంటిక్ చిత్రాల‌లోనే ఎక్కువ‌గా క‌నిపించాడు. అయితే ల‌వ్ రొమాంటిక్ సినిమాల‌తో ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ వ‌స్తుంది కానీ స్టార్ హీరో స్టేట‌స్ మాత్రం క‌ష్ట‌మే అన్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

మరోవైపు చైతూ హీరోగా మాస్ సినిమా చేస్తే ఆ సినిమా ద‌ర్శ‌కుడు కొత్త‌వాళ్లు అయ్యి ఉంటారు.అది కూడా చైతూకు మైన‌స్ గా మారుతుంది. మ‌రోవైపు చైతూ గ‌తంలో త‌న వ‌ద్ద‌కు కొంత‌మంది అగ్ర‌ద‌ర్శ‌కులు మాస్ క‌థ‌ల‌తో వ‌చ్చినా రిజెక్ట్ చేశాడ‌నే టాక్ కూడా ఉంది. మొహ‌మాటం కొద్ది కొన్ని సినిమాలు చేసి చైతూ బొక్క బోర్లా ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తుంటాయి.

bangarraju movie

bangarraju movie

మ‌రోవైపు మ‌న్మ‌థుడిగా పేరు సంపాదించుకున్న నాగార్జున్ స్టేజిల‌పై త‌డ‌బ‌డ‌కుండా స్పీచులు ఇస్తుంటాడు. అమ్మాయిల‌కు పంచ్ లు వేస్తుంటాడు. కానీ చైతూ ద‌గ్గ‌ర ఆ టాలెంట్ కూడా పెద్ద‌గా ఉన్న‌ట్టు క‌నిపించ‌దు. అయితే రీసెంట్ గా వ‌చ్చిన బంగార్రాజు లో మాత్రం యాక్ష‌న్ సీన్ లు కూడా ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా త‌ర‌వాత చైతూ మ‌రో రెండు మాస్ హిట్ లు అందుకుంటే స్టార్ స్టేట‌ప్ కాయం అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading