జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతున్నది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, అలియాభట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియ ప్రధాన పాత్రలను పోషించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తనే చెప్పింది. సాధారణ థియేటర్లలో తొలి మూడు రోజులకు రూ.50, ఆ తరువాత వారం రోజులకు రూ.30 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు ఐమ్యాక్స్ థియేటర్లు, స్పెషల్ కేటగిరి థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.100, ఆ తరువాత వారం రోజులు రూ.50 పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఐదవ షో ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read : భానుడి భగభగలు.. 3 రోజుల పాటు జాగ్రత్త..!
Advertisement
Advertisement
ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100 తరువాత వారం రోజులు రూ.50 పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.50 ఆ తరువాత వారం రోజుల పాటు రూ.30 పెంచుకునే అవకాశం కల్పించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైన పది రోజుల వరకు రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. మూడు రోజుల వరకు టికెట్ల ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.233 గా ఉండగా.. మల్టీప్లెక్స్‌లలో రూ.413 ఉండనున్నది. ఏపీ ప్రభుత్వం ఈ చిత్రానికి రూ.75 పెంచుకోవచ్చు అని తెలిపింది. ఈ రేటు చిత్రం విడుదలైన 10 రోజుల వరకు వర్తిస్తుందని పేర్కొంది. మరొక వైపు ఏపీలో కూడా సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.
ఇవాళ చిత్ర బృందం బెంగళూరులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. రాత్రి బిగ్ ఈవెంట్ జరుగనుందని, ఎన్నో సంవత్సరాల తరువాత అందరినీ కలువబోతున్నాం అని తెలిపారు. ముఖ్యంగా కర్నాటక ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి వస్తుండడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
Also Read : రాజమౌళి కోడలు జగపతిబాబుకు ఏమవుతుందో తెలుసా..?