వెస్టిండిస్ తో జరిగిన రెండవ టీ-20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో వెస్టిండిస్ జట్టును ఓడించింది. ఇక భారత జట్టు గెలవడంతో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి వరకు వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్‌లు పోరాడినా విజయానికి 8 పరుగుల దూరంలో ఆగిపోయారు. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నికోలస్ పూరన్ వికెట్ తీశాడు.
Also Read : Bheemla nayak : పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా మహేష్ బాబు, కేటీఆర్…!
Advertisement
ఇక చివరి ఓవర్‌లో 25 పరుగులు కావాల్సిన తరుణంలో బౌలింగ్ చేసిన హర్షల్‌పటేల్ వరుసగా రెండు సిక్సర్లు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్లో రెండు సిక్సులు కొట్టి పావెల్ ప్రెజర్ పెంచాడు. హర్షల్ పటేల్ చివరి రెండు బంతులకు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇవ్వడంతో చివరి ఓవర్‌లో వెస్టిండిస్ 16 పరుగులు చేయగలిగింది. దీంతో టీమిండియా విజయం సాధించింది.
Advertisement
తొలి ఇన్నింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 41 బంతుల్లో 52, రిషబ్ పంత్ 28 బంతుల్లో 52 కీలక ఇన్నింగ్స్ ఆడారు. అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ (33)కూడా ధాటిగా ఆడడంతో భారత్ 20 ఓవర్లలో 186/5 పరుగులు సాధించారు. వెస్టిండిస్ బౌలింగ్ రోస్టర్ ఛేజ్-3, కాట్రెల్, రోమియో షెఫర్డ్ ఒక్కో వికెట్ తీశారు. రెండవ ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్స్ నికోలస్ పూరన్ 62, రోమన్ పావెల్ 68 పరుగులు సాధించి వెస్టిండిస్‌ను గెలిపించే ప్రయత్నం చేసారు. కానీ 20 ఓవర్లలో 178/3 పరుగులు మాత్రమే చేయగలిగింది వెస్టిండిస్ జట్టు. భారత బౌలింగ్‌లో భువనేశ్వర్‌కుమార్, చాహల్, బిష్ణోయ్ తల ఒక్కో వికెట్ తీశారు.
Also Read : నాన్న ఇచ్చే రూ.60తో ప్రాక్టిసుకు వచ్చే వాడిని : మహమ్మద్ సిరాజ్