Home » భారత జట్టు కొత్త జెర్సీ వెనుక ఇంత కథ ఉందా..?

భారత జట్టు కొత్త జెర్సీ వెనుక ఇంత కథ ఉందా..?

by Azhar
Ad

వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ కొత్త జెర్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్ననే బీసీసీఐ ఆ కొత్త జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ జెర్సీ అనేది వచ్చిన తర్వాత నుండి దానిపైన పెద్ద చర్చనే జరుగుతుంది. అందులో ఉన్న త్రిభుజాలు, లైట్ బ్లూ కలర్ లో ఉన్న పూరేకుల ఆకారం.. అలాగే బీసీసీఐ లోగో పైన ఉన్న స్టార్స్ ఎందుకు అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.

Advertisement

కానీ ఈ కొత్త జెర్సీ వెనుక ఉన్న కథను… బీసీసీఐ టీమిండియా జెర్సీ పార్ట్నర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ వివరించింది. అయితే ఈ జెర్సీలో ఉన్న త్రిభుజాలు అనేవి.. భారత ఫ్యాన్స్ ను, ఆట స్పిరిట్ ను అలాగే జట్టు పవర్ ను సూచిస్తాయి. ఇక ఇందులో లైట్ బ్లూ కలర్ లో ఉన్న పూరేకుల ఆకారాలు అనేవి మెరిట్, లొయాలిటీకి చిహ్నాలు.

Advertisement

ఇక జెర్సీలో బీసీసీఐ లోగో పైన మూడు స్టార్స్ అనేవి ఉన్నాయి. ఈ మూడు స్టార్స్ కూడా మన భారత జట్టు 1981 లో సాధించిన వన్డే ప్రపంచ కప్ తో పాటుగా.. 2007 లో సాధించిన టీ20 ప్రపంచ కప్ అలాగే 2011 లో గెలిచిన రెండో ప్రపంచ కప్ కు గుర్తులు అని పేర్కొన్నారు. ఇక ఈ విషయాలు అన్ని తెలిసిన తర్వాత దీని వెనుక ఇంత కథ ఉందా అని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఓపెనర్ గా కాదు.. మూడో స్థానంలో కూడా వద్దు..!

ఆసీస్ పైన ఓడిపోతే ప్రపంచ కప్ పోయినట్లే…!

Visitors Are Also Reading