ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత భారత పర్యటనకు సౌత్ ఆఫ్రికా జట్టు వస్తుంది. ఈ పర్యటనలో ఇండియా – సౌత్ ఆఫ్రికాల మధ్య 5 టీ20 ల సిరీస్ జరుగుతుంది. అయితే ఈ సిరీస్ లో ఆడబోయే జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఐపీఎల్ 2022 సీజన్ లో రాణిస్తున్న ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ… ఈ సిరీస్ కు సీనియర్లకు విశ్రాంతిని కల్పించింది. దాంతో ఈ జట్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవరించనుండగా… చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చింది. అలాగే కొంత మంది ఆటగాళ్లను బీసీసీఐ పటించుకోలేదు.
Advertisement
దాంతో బీసీసీఐ సెలక్టర్లకు కళ్ళు పోయాయా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐపీఎల్ 2022 మెగవేలంలో 15 కోట్లు పలికిన ఇషాన్ కిషన్ దారుణంగా విగలమయ్యాడు. మొదటి రెండు మ్యాచ్ లు.. ఆఖరి రెండు మ్యాచ్ లు మినహా మిగిలిన అన్ని మ్యాచ్ లలో నిరాశపరిచాడు. అయిన అతడిని ఎంపిక చేసిన బీసీసీఐ ఈ సీజన్ లో కెప్టెన్ గా బ్యాటర్ గా మంచి పెరఫార్మెన్స్ ఇస్తున్న సంజూని మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది సంజూ దాదాపు ప్రతి మ్యాచ్ లోను పరుగులు చేసాడు. జట్టు అవసరాని బట్టి నెమ్మదిగా.. వేగంగా ఆడుతూ వచ్చాడు. అందువల్ల అతనికి అవకాశం సిస్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
Advertisement
అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ఈ ఐపీఎల్ లో మూడో స్థానంలో కోహ్లీ కంటే మంచి బ్యాటింగ్ చేసాడు. దాంతో అతనికి కూడా ఆవకాశం వస్తుంది అనుకున్నారు. కానీ సెలక్టర్లు మాత్రం అతని వైపు కూడా చూడలేదు, దాంతో బీసీసీఐ మొత్తం పక్షపాతం వహిస్తుంది అని అంటున్నారు ఫ్యాన్స్. బాగా ఆడుతున్న ఆటగాళ్లకు కాకుండా ఇషాన్ కిషన్ వంటి విఫల బ్యాటర్లకు ఛాన్స్ ఇస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా తాను సంజూ, త్రిపాఠి జట్టులో ఉంటారు అనుకున్నాను అంటూ ట్విట్ చేసాడు.
ఇవి కూడా చదవండి :
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వానగండం గుజరాత్ కు కలిసి వస్తుందా..?
ఆర్ఆర్ ఫ్లైట్ లో పొగమంచు.. ల్యాండ్ చేయాలంటూ ఆటగాళ్ల కేకలు..!