Telugu News » Blog » ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వానగండం గుజరాత్ కు కలిసి వస్తుందా..?

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వానగండం గుజరాత్ కు కలిసి వస్తుందా..?

by Manohar Reddy Mano
Ads

ఈరోజు ఐపీఎల్ 2022 లో పంజాబ్ కింగ్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ తో ఈ సీజన్ యొక్క లీగ్ దశ పూర్తి అవుతుంది. ఇక ఈ నెల 24న మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఎందుకంటే లీగ్ మ్యాచ్ లు మొత్తం ముంబైలో జరగగా… క్వాలిఫైర్ 1 మ్యాచ్ కోల్కతా లో జరుగుతుంది. కానీ అక్కడ గత రెండు, మూడు రోజులుగా విపరీతమైన వర్షం కురుస్తుంది. ఈ మ్యాచ్ జరగాల్సిన ఈడెన్ గార్డెన్స్ కూడా తడిసి ముద్దయ్యింది. అలాగే ఈ స్టేడియంలోని ప్రెస్ బాక్స్ పగిలిపోయింది.

Advertisement

ఈ క్రమంలో అక్కడ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరుగుతాయా.. లేదా అనే అనుమానం వస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే మాత్రం గుజరాత్ జట్టుకు బాగా కలిసి వస్తుంది. ఎలా అంటే… ప్రస్తుతం ప్లే ఆఫ్స్ కు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్లు అర్హత సాధించాయి. ఇందులో మొదటి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్, రాజస్థాన్ 24న జరగాల్సిన క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో ఎదురు పడాలి. ఇందులో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్స్ కు వెళ్లగా.. ఓడిన జట్టు క్వాలిఫైర్ 2 కి వస్తుంది.

Advertisement

అయితే ఒకేవేళ 24న ఈ మ్యాచ్ జరగకుంటే…పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ నియమాల ప్రకారం నేరుగా ఫైనల్స్ కు వెళ్తుంది. అలాగే రాజస్థాన్ జట్టు క్వాలిఫైర్ 2 కి వస్తుంది. కానీ ఒకవేళ మ్యాచ్ జరిగి గుజరాత్ ఓడిపోతే వారు మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ మ్యాచ్ గనక రద్దు అయితే అది హార్దిక్ పాండ్య జట్టుకు కలిసి వస్తుంది. అలాగే సంజూ జట్టు ఈ నెల 27న ఎలిమినేటర్ లో విజయం సాధించిన జట్టుతో క్వాలిఫైర్ 2 మ్యాచ్ ను అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

భారత టీ20 కెప్టెన్ గా రాహుల్.. టెస్ట్ కెప్టెన్ గా రోహిత్..!

Advertisement

ఆర్ఆర్ ఫ్లైట్ లో పొగమంచు.. ల్యాండ్ చేయాలంటూ ఆటగాళ్ల కేకలు..!