Home » ఆర్ఆర్ ఫ్లైట్ లో పొగమంచు.. ల్యాండ్ చేయాలంటూ ఆటగాళ్ల కేకలు..!

ఆర్ఆర్ ఫ్లైట్ లో పొగమంచు.. ల్యాండ్ చేయాలంటూ ఆటగాళ్ల కేకలు..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 సీజన్ ను ఎటువంటి అంచనాలు లేకుండా ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతాలు చూపించింది. చెన్నై, ముంబై వంటి బలమైన జట్లకు కూడా చుక్కలు చూపిస్తూ విజయాలను అందుకుంది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఆడిన 14 మ్యాచ్ లలో మొత్తం 9 విజయాలు నమోదు చేసిన లీగ్ దశను 18 పాయింట్లతో రెండవ స్థానంలో ముగించింది. మొదటి స్థానంలో గుజరాత్ 20 పాయింట్లతో ఉంది. అయితే ఈ ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్ లు మొత్తం ముంబైలోనే జరగగా… క్వాలిఫైర్ 1 మరియు ఎలిమినేటర్ మ్యాచ్ లు మాత్రం కోల్కతాలో జరగనున్నాయి.

Advertisement

దాంతో ముంబై నుండి కోల్కతా ఫ్లైట్ లో వెళ్తున్న రాజస్థాన్ ఆటగాళ్లకు వింత అనుభవం ఎదురైంది. ఈ విషయాని ఆ జట్టు సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో ఎం ఉందంటే… ఫ్లైట్ ప్రారంభమైన తర్వాత కాసేపటికి అందులోకి కొంచెం పొగ మంచు రాగ…5 నిమిషాల్లో పొగమంచు మొత్తం ఫ్లైట్ ను నింపేసింది. పక్కపక్కన ఉన్న ఆటగాళ్లే ఒక్కరికి ఒక్కరు కనిపించకుండా అయిపోయారు. ఆ తర్వాత కాసేపట్టికి పొగమంచు పోయిన… ఫ్లైట్ కొంచెం కుదుపులకు గురైంది.

Advertisement

దాంతో అందులో ఉన్న ఆటగాళ్లలో కొంత మంది ఫ్లైట్ ను ల్యాండ్ చేయాలంటూ అరుస్తుంటే.. మరికొంత మంది ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చివరకు ఫ్లైట్ క్షేమంగా కోల్కతా చేరింది. అసలు అలా ఎందుకు అయిందంటే… కోల్కతాలో గత రెండు మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు విమానం మేఘాల్లో నుంచి వెళ్లడంతో అలా ఫ్లై‌ట్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అయితే ఈ నెల 24న రాజస్థాన్ గుజరాత్ జట్టుతో క్వాలిఫైర్ 1 లో తలపడుతుంది. అందులో గెలిస్తే నేరుగా ఫైనల్స్ కు వెళ్తుంది. ఒకవేళ ఓడితే క్వాలిఫైర్ 2 లో ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

భారత టీ20 కెప్టెన్ గా రాహుల్.. టెస్ట్ కెప్టెన్ గా రోహిత్..!

అర్జున్ కు ఈ సీజన్ కూడా నిరాశే.. సీరియస్ అవుతున్న అభిమానులు..!

Visitors Are Also Reading