ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో గడపడం పరిపాటిగా మారింది. చిన్న పిల్లోడి నుంచి పండు ముసలి వరకు దాదాపుగా ఎక్కువశాతం సోషల్ మీడియాకు అట్రాక్ అయ్యారు. అలాంటి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏమి వైరల్ ఉంటుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చాలా మంది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కొంత మంది ఖాతాలు అనుకోకుండా హ్యాకింగ్‌కు కూడా గురవుతుంటాయి. ఇక ప్రముఖులు, సెలబ్రిటీలు, వివిధ సంస్థలు, ఫేమస్ వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు ఇలా ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఖాతాలను హ్యాకర్స్ బెడద వెంటాడుతూనే ఉంది.
Advertisement
Advertisement
ఇటీవల ఎంతో సెలబ్రిటిల ట్విట్టర్ అకౌంట్ల్ కాకుండా పార్టీల ఖాతాలను సైతం హ్యాక్ చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా హ్యాక్ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఆ ఖాతాకు టీడీపీకి బదులు ఎలాన్ మస్క్ పేరు మార్చిన హ్యాకర్స్.. విచిత్రమైన ట్విట్స్ చేశారు. ఇక టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన విషయాన్ని వెల్లడించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందంటూ వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేసిన లోకేష్ ఆ ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Also Read : 19th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!