Home » 19th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

19th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు కడపలో రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పురంధేశ్వరి, ఇతర రాష్ట్ర నేతలు హాజరు కానున్నారు.

Advertisement

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు నిరసనలకు టీడీపీ పిలుపునిచ్చింది. నాటుసారా నిషేధించాలంటూ టీడీపీ ఆందోళనలు చేపడుతోంది.

 

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతా హ్యాక్ అయ్యింది. టీడీపీ ట్విట్టర్‌ అకౌంట్‌ను ను సైబర్‌ నేరగాళ్లు హ్యక్ చేశారు. ఖాతాకు టీడీపీకి బదులు ఎలాన్‌ మస్క్‌ అంటూ పేరును మార్చారు.

 

భారత్‌లో ఇవాళ, రేపు జపాన్‌ ప్రధాని పుమియో కిషిడా పర్యటిస్తున్నారు.

 

ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజ్ థియేటర్ లో కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సినిమా ప్రదర్శన సమయంలో కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. దాంతో థియేటర్లో ఉన్న కొందరు యువకులు నినాదాలు చేసిన వారిపై దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సొంత పార్టీ నుండి వ్యతిరేకత వస్తోంది. సొంత పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు ఇమ్రాన్ ఖాన్ పై తిరుగుబాటు మొదలు పెట్టారు.

 

18 ఏళ్లు నిండిన కూతురు తండ్రితో బంధాన్ని తెంచుకుంటే ఆమె విద్య మరియు పెళ్లి ఖర్చులను తండ్రి భరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మేజర్ అయ్యాక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ హక్కులు ప్రతి అమ్మాయికి ఉన్నాయని పేర్కొంది. అయితే తండ్రి నుంచి మాత్రం డబ్బులు అడిగే హక్కు మాత్రం ఉండదని స్పష్టం చేసింది.

 

బౌద్ధమత గురువు దలైలామా రెండేళ్ల తర్వాత మీడియా ముందు కనిపించారు. వేలాదిమంది టిబెటన్లు భక్తులకు తన బోధను వినిపించారు.

 

తిరుమలలో ఎల్లుండి ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకే విడతలో అత్యధిక సంఖ్యలో దర్శన టికెట్లు విడుదల చేయనున్న అధికారులు.. 92 రోజులకు సంబంధించి 25 లక్షల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.

Visitors Are Also Reading