అండర్-14 టోర్నీలో తన్మయ్ సింగ్ అనే బాలుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అదుర్స్ అనిపించాడు. కేవలం 132 బంతుల్లో 401 పరుగులు సాధించాడు. ప్రధానంగా ఇందులో 30 ఫోర్లు, 38 సిక్సర్లున్నాయి. సోమవారం నోయిడాలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన మ్యాచ్ లో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తరుపున బరిలోకి దిగిన తన్మయ్ సింగ్ చెలరేగి ఆడాడు. అతనికి తోడు రుద్ర బిధురి అజేయంగా 135 పరుగులు చేయడంతో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ 656 పరుగులు చేసింది.
Advertisement
అనంతరం ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 193 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దేవరాజ్ స్కూల్ 463 పరుగుల భారీ తేడాతో విక్టరీ సాధించింది. ఇప్పటికే స్కూల్ క్రికెట్, క్లబ్ క్రికెట్ లో ఎంతోమంది క్రికెటర్లు చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడారు. సచిన్, వినోద్ కాంబ్లీ, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వి షా వంటి క్రికెట్ ప్లేయర్లు చిన్నతనంలోనే చిచ్చరపిడుగులా చెలరేగి ఆడిన ప్లేయర్లు కావడం విశేషం. తాజాగా వారి సరసన తన్మయ్ సింగ్ నిలిచాడు. 13 ఏళ్ల వయస్సులోనే అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం విశేషం.
Also Read : ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు మెస్సీ ఆదాయం, ఆస్తుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
Advertisement
ఈ మ్యాచ్ ర్యాన్ ఇంటర్నేషనల్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తరుపున ఇన్నింగ్స్ ఆరంభించిన తన్మయ్ సింగ్ మొదటి నుంచి చితక్కొట్టడం ప్రారంభించాడు. వచ్చిన బాల్ ని వచ్చినట్టు బౌండరీ తరలించాడు. 38 సిక్సర్లు, 30 ఫోర్లు బాదుడంటే.. అతడి బాదుడు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.సిక్స్ లతో 226 పరుగులు, ఫోర్లతో 120 రన్స్ సాధించాడు. అతని సూపర్ ఇన్నింగ్స్ కి ప్రత్యర్థి ఫీల్డర్లు బౌండరీ దగ్గరే బంతి కోసం ఫీట్లు చేశారు. 656 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు.. ఏ దశలో కూడా కనీస పోరాడలేకపోయింది. కళ్ల ముందు భారీ లక్ష్యం కనిపిస్తుండడంతో బ్యాట్స్ మెన్ ఒత్తిడికి గురయ్యారు. 193 పరుగులకే జట్టు మొత్తం పెవిలియన్ క్యూ కట్టారు. దేవరాజ్ స్కూల్ 463 రన్స్ భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది. స్కూల్ డేస్ లో సచిన్, వినోద్ కాంబ్లీ రికార్డు స్థాయి ఇన్నింగ్స్ ఆడిన విషయం విధితమే.
Also Read : యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా..?