కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను గత సంవత్సరం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. గత ఏడాది నటి మహాలక్ష్మి శంకర్ ను వివాహం చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నారు. తాజాగా రవీంద్రన్ చిక్కుల్లో పడ్డారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వారు రవీందర్ ను అరెస్ట్ చేశారు. ఒక ప్రముఖ వ్యాపారవేత్తను రవీందర్ మోసం చేశాడని అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒక ప్రాజెక్టును పెట్టుబడిగా పెట్టి గణనీయమైన లాభాలను పొందవచ్చని రవీందర్ భావించాడు. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను తయారు చేయించి చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేశాడు. అందుకుగాను అతని వద్ద నుంచి రూ. 15.83 కోట్ల డబ్బులు తీసుకున్నాడని సమాచారం అందుతోంది. ఈ ఒప్పందం ఇప్పుడు కుదుర్చుకున్నది కాదు. గత రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు రవీందర్ చెప్పిన మాటలు నెరవేర్చడంలో విఫలమయ్యాడు.
Advertisement
Advertisement
దీంతో తన డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా బాలాజీ ప్రశ్నించగా… రవీందర్ నుంచి సరైన సమాధానం రాలేదు. రవీందర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక బాలాజీ అతని మోసాలను, ఆర్థిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో బాలాజీ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి రవీందర్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మిని వివాహం చేసుకొని ఈ జంట సోషల్ మీడియాను, ఇండస్ట్రీని హల్చల్ చేసింది.
ఇవి కూడా చదవండి
IND VS PAK : టీమిండియా-పాక్ మ్యాచ్ అంటే… మహా భారతమేనా ?
నిత్యం దేవునికి పూజలు చేసే వారికే కష్టాలు వస్తాయి… ఎందుకో తెలుసా….?
Rajinikanth : గుడిలో పూజారికి దక్షిణ వేసిన తలైవా రజనీకాంత్