Home » నిత్యం దేవునికి పూజలు చేసే వారికే కష్టాలు వస్తాయి… ఎందుకో తెలుసా….?

నిత్యం దేవునికి పూజలు చేసే వారికే కష్టాలు వస్తాయి… ఎందుకో తెలుసా….?

by Bunty
Ad

 

ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో దేవునికి పూజలు చేసే వారికి ఎందుకు కష్టాలు ఇస్తావయ్యా… పూజలు చేయనివారికి ఎలాంటి కష్టాలు ఇయ్యవేంటి అని అనుకుంటూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనిపిస్తూనే ఉంటుంది. అయితే ఎక్కువగా పూజలు చేసే వారికి కష్టాలు వస్తాయి. దానికి గల కారణం ఏంటంటే…. అయితే ఒకానొక సమయంలో ఒక భక్తుడు శ్రీమహావిష్ణువుని పూజించేవారికి ఎందుకు కష్టాలు ఇస్తావు స్వామి అని ప్రశ్నించాడు. నిత్యం నీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నావు. అసలు కనీసం నీకు పూజ చేయని వారికి, దీపం పెట్టని వారికి సుఖాలు సంతోషాలు ఇస్తున్నావు అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీమహావిష్ణువు ఆ భక్తుడితో చెబుతూ ఒకానొక సమయంలో నారదుడు కూడా నన్ను ఇలాగే ప్రశ్నించాడు. అప్పుడు నేను నారదుడితో ఇలా చెప్పాను.

Difficulties will come to those who always worship God

Difficulties will come to those who always worship God

నారద మనమిద్దరం సామాన్యమైన మనిషి రూపంలో బ్రాహ్మణ దుస్తులు ధరించి భూలోకానికి వెళ్లి సంచరించి వద్దాం అని అంటాడు. అప్పుడు నారదుడు సరే అని వీరిద్దరూ వస్త్రాలు ధరించి భూలోకానికి వెళ్తారు. అలా వెళ్లే సమయంలో ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి విష్ణువు ఇలా అంటాడు. బాగా ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు. అందుకు ఆ ఇంటి యజమాని మీ బాబు సొమ్ము ఏమైనా ఉన్నాయి ఇక్కడ తినడానికి అడుగుతున్నారు. వెళ్ళు అని అంటాడు. అప్పుడు నారదుడు, శ్రీమహావిష్ణువు ఇద్దరూ బయటికి వస్తారు. అప్పుడు నారదుడు శ్రీమహావిష్ణువుని బయటకు తీసుకువచ్చి అతను అంత అవమానం చేశాడు నీవు ఏమీ అనలేదు ఏంటి అంటాడు.

Advertisement

Advertisement

అప్పుడు విష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపులా నుంచి ధనం రావాలి. మీ ఇంట్లో వ్యాపారం పెరగాలి అని వరాన్ని ఇస్తాడు. అప్పుడు నారదుడు మిమ్మల్ని తిట్టి వెళ్లి పొమ్మన్న వారికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని అంటున్నారు ఏంటి స్వామి అంటున్నారు. ఇక అక్కడి నుంచి ముందుకు వెళుతుండగా ఒక చిన్న గుడిసె కనిపించింది. అమ్మ ఆకలిగా ఉంది ఏమైనా పెడతావా అని అడిగితే… అప్పుడు ఆ తల్లి మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. నాకు ఒక ఆవు మాత్రమే ఉంది. అది రోజు పాలనే ఇస్తుంది. ఆ పాలు ఉన్నాయి ఇంట్లోకి రండి అని తీసుకెళ్లి కూర్చోబెట్టి పాలని ఇచ్చింది. అప్పుడు నారదుడు సంతోషంతో ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అని అనగానే శ్రీమహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవిస్తాడు. అప్పుడు నారదుడు కోపంతో మన కడుపు నింపిన తల్లికి తన ఆవు చనిపోవాలని వరం ఇస్తావా, అదే ఆ యజమాని మనల్ని బయటకు పంపాడు అతనికి ధనం రావాలి అని దీవించావు. నీ లీలలు నాకు అర్థం కావడం లేదు స్వామి అని అంటాడు. దానికి విష్ణువు ఈ ముసలావిడ రోజు నన్నే తలుస్తూ ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ ఉంది. ఆ ముసలావిడకి నేను చనిపోతే నా ఆవు ఏమైపోతుందో అని బాధపడుతుంది.

 

అలా ఆవిడ ఆలోచిస్తూ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు. నా దగ్గరికి చేరుకోలేదు. అందుకు నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలని చెప్పాను. దానికి నారదుడు సరే స్వామి అర్థమైంది. మరి ఆ యజమానికి ఎందుకు ధనం రావాలని వరం ఇచ్చారు అని అడిగితే… అప్పుడు విష్ణువు అతనికి ధనం మీద చాలా ప్రేమ ఉంది. లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు ధ్యాసలోనే, డబ్బు మీద ప్రేమతోనే, డబ్బు యొక్క ఆలోచనలతోనే మరణిస్తాడు. అతను చనిపోయాక కూడా ఒక పాము లాగా జన్మించి సంపద వద్దనే ఉంటాడు. ఎప్పటికీ భగవంతుని వద్దకు చేరుకోలేడు అని చెప్పాడు చెబుతాడు. భగవంతునికి ఏది ఎప్పుడు ఎవరికీ ఇవ్వాలో తెలుసు. మనం ప్రస్తుతం గురించి ఆలోచిస్తాము. భవిష్యత్తుని ఆలోచించము. భగవంతుడు భవిష్యత్తుని ఆలోచించి నిర్ణయం తీసుకొని వరాన్ని ఇస్తాడు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని నిందించకుండా ఎల్లప్పుడూ దేవుని నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్లాలి అని చెబుతాడు శ్రీ మహా విష్ణువు.

Visitors Are Also Reading