Home » సినిమాల ద్వారా తమన్నా ఎన్ని కోట్లు వెనకేసిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. ?

సినిమాల ద్వారా తమన్నా ఎన్ని కోట్లు వెనకేసిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. ?

by Mounika
Ad

మిల్కీ బ్యూటీ తమన్నాకి యూత్ లో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు మనోజ్ తో కలిసి “శ్రీ” అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు పూర్తి అవుతున్న కూడా అభిమానులలో ఆమెకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. ప్రస్తుతం తమన్నా తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా అన్ని భాషలలో వరస ఆఫర్లతో దూసుకుపోతుంది.

Advertisement

ఇటీవల బాలీవుడ్ లో విడుద‌లైన జీ కర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌ల‌లో బోల్డ్ లుక్ లో కనిపించి త‌మ‌న్నా అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఇక తెలుగులో ఉన్న సీనియర్ హీరోలకు పక్కన హీరోయిన్ గా నటించడానికి తమన్నా బెస్ట్ ఆప్షన్ గా ఉంది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ అమ్మడు అక్షరాలా ఫాలో అయిపోతుంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్ని విడిచి పెట్టుకోకుండా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లతోపాటు అన్ని చేసుకుంటూ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.

Thamanna

 

ప్రస్తుతం తమన్నా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంక‌ర్‌తో పాటు.. తమిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ జైల‌ర్‌ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.  ప్రస్తుతం ఒక సినిమాకు గాను మిల్కీ బ్యూటీ తమన్నా 4 నుండి 5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఇక పలు యాడ్స్, బ్రాండ్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్ల రెమ్యూనరేషన్ తన ఖాతాలో జమ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తమన్నా ఎంత ఆస్తి సంపాదించి ఉంటుంది అంటూ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అందరిలో మొదలైంది.

Advertisement

ఒకవైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్ తో సంపాదించడమే కాకుండా ఈ బ్యూటీ బిజినెస్ రంగంలోకూడా అడుగు పెట్టింది. తమన్నా 2015లో వైట్ & గోల్డ్ పేరుతో జ్యూవ్వెలరీ బిజినెస్ ను మొదలుపెట్టింది. ఈ బిజినెస్ లో తమన్నా సూప‌ర్ స‌క్సెస్ సాధించింది. ఇక త‌మ‌న్నా ఏడాదికి సినిమాలు, యాడ్స్ ద్వారా 20 కోట్ల‌కు పైగా సంపాదిస్తుంద‌ట‌. సంపాద‌న విష‌యంలో తమన్నా స్టార్ హీరోలకు సైతం ఏమాత్రం తక్కువ లేదట.

త‌మ‌న్నా ఆస్తుల విలువ మొత్తంగా 120 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా తమన్నాకు కోట్ల విలువ చేసే సొంతం ఇల్లుతో పాటు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా తమన్నా ఇల్లు 80,778 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. అంతేకాకుండా ఆమెకు దాదాపు రూ. 16.60 కోట్లు అపార్ట్‌మెంట్  కూడా  ఉంది. దీనిలో ఖరీదైన ఫర్నీచర్‌తో పాటు,  క్లాస్సి ఫీచర్లు కూడా ఉన్నాయి. తమన్నాకు చెందిన ఈ ఇల్లు  ముంబైలోని జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లో ఉన్న ‘బేవ్యూ అపార్ట్‌మెంట్’ 14  వ అంతస్తులో ఉంది . మొత్తంగా ఈ 20 ఏళ్లలో తమన్నా సినిమాల ద్వారా గట్టిగానే సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

Visitors Are Also Reading