Home » Tamannah : తమన్నా పెళ్లి ఫిక్స్‌…వరుడు ఎవరంటే ?

Tamannah : తమన్నా పెళ్లి ఫిక్స్‌…వరుడు ఎవరంటే ?

by Bunty
Ad

 

Tamannah : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు… తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ తమన్నా. 2005 సంవత్సరంలో శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్నా… హ్యాపీడేస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

Tamanna Bhatia getting Married to her Boyfriend

Tamanna Bhatia getting Married to her Boyfriend

ఆ తర్వాత గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేసి మిల్కీ బ్యూటీ అనే పేరు కూడా తెచ్చుకుంది తమన్నా. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోల అందరి సరసన నటించింది హీరోయిన్ తమన్నా. హీరోయిన్గా నటించడమే కాకుండా ఐటెం సాంగ్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఇటీవలే రజినీ కాంత్‌ చేసిన జైలర్‌ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసింది తమన్నా. ఈ సాంగ్‌ కోసం ఏకంగా 4 కోట్లు వసూలు చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉండగా… లవ్ బర్డ్స్ తమన్నా-విజయ్ వర్మ వివాహానికి సిద్ధమైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని మిల్కీ బ్యూటీ గతంలో ప్రకటించగా, పేరెంట్స్ ఒత్తడితో ఒప్పుకున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ఎంగేజ్మెంట్ ఉంటుందని, ఫిబ్రవరిలో మ్యారేజ్ జరుగుతుందని తెలుస్తోంది. తాము ప్రేమలో ఉన్నట్లు ఈ జంట కొన్ని నెలల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading