Home » తమన్ కి ట్రోలింగ్ మళ్ళీ తప్పట్లేదుగా? “గుంటూరు కారం” ట్రైలర్ మహిమ?

తమన్ కి ట్రోలింగ్ మళ్ళీ తప్పట్లేదుగా? “గుంటూరు కారం” ట్రైలర్ మహిమ?

by Srilakshmi Bharathi
Ad

ఈరోజు గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను మించి ఉందనే చెప్పచ్చు. అయితే.. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఎమోషన్స్ ని హైడ్ చేసినట్లు అనిపిస్తుంది. అలాగే.. ఎక్కువగా ఖలేజా టైం నుంచి మిస్సయిన మహేష్ మాస్ యాంగిల్ ని ఈ ట్రైలర్ లో బాగా హైలైట్ చేసారు. అలాగే.. ఈ ట్రైలర్ కట్ చాలా బాగా వచ్చినప్పటికీ స్టోరీ మాత్రం ఎక్కడా రివీల్ అయినట్లు అనిపించదు. అంటే స్టోరీ ని కూడా చాలా సస్పెన్స్ లో పెట్టినట్లు అనిపిస్తుంది.

Advertisement

కనీసం స్టోరీ లైన్ తెలియాలంటే కూడా థియేటర్ కి వెళ్లాల్సిందే అని తెలుస్తుంది. ప్రాసలతో కూడిన డైలాగ్స్ కూడా ఎక్కడా ట్రైలర్ లో కనిపించలేదు. అయితే కథని కూడా కనీసం చూచాయగా అయినా చూపించకపోవడం మైనస్ అవుతుందేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఎదో అనుకుని వెళితే.. అక్కడ మరేదో కనిపిస్తే.. సినిమా రిజల్ట్ గల్లంతయ్యే అవకాశం ఉంటుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె.. మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని మాత్రం గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

ఈ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ మైనస్ పాయింట్ గా ఉంది. గ్లిమ్ప్స్ కి ఇచ్చిన బీట్ నే అటు ఇటు తిప్పేసి ట్రైలర్ కి పెట్టినట్లు ఉంది. “సరిలేరు నీకెవ్వరూ” సినిమాకే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ను విని మహేష్ అభిమానులు గట్టిగానే తిట్టుకున్నారు. ఇప్పుడు తమన్ ని చూసాకే దేవిశ్రీనే బెటర్ అని అనుకుంటున్నారట. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పేలవంగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె మరో నాలుగు రోజుల్లో రిలీజ్ అయ్యే మూవీ కి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలానే ఉంటె.. తమన్ ని ట్రోలింగ్ తప్పదేమో.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading