చాలామంది, ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, బెల్లం కూడా మనకి ఎంతో సహాయం చేస్తుంది. బెల్లం లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం తో పాటుగా ఇతర పోషకాలు కూడా బెల్లం లో ఉంటాయి. బీ కాంప్లెక్స్, విటమిన్ సి, డీ టు కూడా ఇందులో ఉంటుంది. బెల్లం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. బెల్లంతో నెయ్యి కలిపి తీసుకుంటే, మలబద్ధకం సమస్య నుండి బయటపడొచ్చు.
Advertisement
Advertisement
నెయ్యి, బెల్లం రెండు కూడా ఆరోగ్యానికి మంచివి. బెల్లం, ధనియాలని కలిపి తీసుకుంటే మహిళలు నెలసరి సమయంలో వచ్చే సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. బెల్లం సోంపు కలిపి తీసుకుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. అదేవిధంగా బెల్లం మెంతులు కలిపి తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. బెల్లం ఆలివ్ గింజల్ని కలిపి తీసుకుంటే ఐరన్ ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. పల్లీలు, బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పెరుగుతుంది. బెల్లం, పసుపు కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్వరం నుండి త్వరగా కోలుకోవాలంటే బెల్లం సొంఠి కలిపి తీసుకోవాలి.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఏకాగ్రత చాలా అవసరం
- పండ్లు తొందరగా కుళ్లి పోతున్నాయా..? అయితే ఇలా ప్రయత్నించండి..!
- ఉప్పు తినడం వల్ల ఆ అవయవాలకు ఆ అవయమాలకు అంత ప్రమాదామా..?