Home » పండ్లు తొందరగా కుళ్లి పోతున్నాయా..? అయితే ఇలా ప్రయత్నించండి..!

పండ్లు తొందరగా కుళ్లి పోతున్నాయా..? అయితే ఇలా ప్రయత్నించండి..!

by Anji
Published: Last Updated on
Ad

పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది పండ్ల మీదనే ఆధారపడుతున్నారు కూడా. పండ్లు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగని కొంతమంది మార్కెట్ కు వెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తంలో పండ్లను తీసుకొస్తారు. అయితే అవి ఏమో ఎక్కువ కాలం నిల్వ ఉండవు. రెండు, మూడు రోజులకే రంగు మారి లోపల కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. అంత ఖర్చు పెట్టి తెచ్చినవి చెత్తబుట్ట లోకి వెళితే మనసు ఒప్పుకోదు. అలాగని అస్తమాను మార్కెట్ కు వెళ్లి తెచ్చుకోలేం. ఇలా పండ్లు కుళ్ళిపోకుండా ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎక్కువ మొత్తంలో పండ్లను ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాటిని ముందు పేపర్ తో కానీ, టవల్ తో కానీ తుడవాలి. అవి తడిగా లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. కొంతమంది సలాడ్స్ కోసమని ముందుగానే కట్ చేసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేస్తారు. ఇలా కట్ చేసిన వాటిని నేరుగా కాకుండా గాలి చొరబడని కంటైనర్ లో ఉంచుకోవాలి. కట్ చేసిన ఫ్రూట్స్ రంగు మారకుండా ఉండాలంటే వెంటనే వాటిపై నిమ్మరసాన్ని చల్లాలి. కొన్ని పండ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తేనే ఫ్రెష్ గా ఉంటాయి. ద్రాక్ష, బెర్రీలు, కమల, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ ను గాలి చొరబడకుండా తేమ లేకుండా ప్లాస్టిక్ బ్యాగ్ లో లేదా కంటైనర్స్ లో నిల్వ చేసుకోవచ్చు.

Advertisement

Advertisement

పండ్లను అన్ని కలిపి కూడా నిల్వ చేయకూడదు. ఎందుకంటే కొన్ని రకాల పనులు ఇథలీన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. యాపిల్, అవకాడోలు, అరటి పండ్లు వంటి వాటిని సపరేటుగా నిల్వ చేయాలి. పండ్లు కలర్ మారకుండా, తొందరగా పాడవకుండా ఉండేందుకు వాటిని ఫ్రీజింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ని కట్ చేసి బేకింగ్ షీట్ లో పెట్టి ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రీజ్ చేసిన వాటిని స్మూతీస్, జ్యూస్ వంటి వాటిల్లో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న ఫ్రూట్స్ రెండు, మూడు రోజులు అయితేనే పరవా లేదు. కానీ మరీ ఎక్కువ రోజులు నిలువ చేసుకొని తినకూడదు. కుదిరితే రెండు, మూడు రోజులకు సరిపడా ఫ్రూట్స్ తెచ్చుకుని ఫ్రెష్ గా తింటే అసలైన బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Visitors Are Also Reading