Home » తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరో చెప్పిన టబు..!!

తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరో చెప్పిన టబు..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు ఇండస్ట్రీ లోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్ లలో ఈమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఆమె నటన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు కదూ.. ఆమె అందాల టబు.. ఈ అమ్మడు ఐదు పదుల వయసులో కూడా ఇంకా కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇంత వయస్సు వచ్చినా కానీ పెళ్లి గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై మీడియా ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె తను ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఒంటరిగా ఉండటానికి కారణం ఏంటో వెల్లడించింది..

తను ఒంటరిగా ఉండటానికి కారణం అజయ్ దేవగన్ అని ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పింది. నేను ఎదుగుతున్న టైంలో నాకున్న స్నేహితులు అజయ్ దేవగన్ ఒకరు. అతడు నా కజిన్ సమీర్ ఆర్యకు కూడా తెలుసు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు సమీర్ మరియు అజయ్ నాపై గూడచార్యం చేసేవారు. నన్ను వెంబడించే వారు. నా వెంట తిరుగుతూ ఇతర అబ్బాయిలను కూడా బెదిరించే వారు అని తెలియజేసింది. ఆ ఇద్దరు పెద్ద రౌడీలు.. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అంటే దానికి ప్రధాన కారణం అజయ్.ప్రస్తుతం అతను పశ్చాత్తాపం చెందాడని .. తను చేసిన పనికి చింతిస్తున్నాడని నేను అనుకుంటున్నా.. అంటూ సరదాగా మాట్లాడింది. ఒంటరితనం అనేది శాపం కాదు అని అన్నారు. అయితే పెళ్లి విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో అంతటి స్టార్ హీరోయిన్ ఒంటరిగా ఉండడం అభిమానులకు నచ్చడం లేదు. తనని కూడా ఒక కుటుంబంతో చూడాలని చాలా మంది అభిమానులు ఆశ పడుతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన టబు పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ALSO READ;

నటి పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరంటే ? ఆయనతో ఉన్న వివాదం అదేనా ?

వామ్మో ఫస్ట్ లుక్ చూసి కేక అనుకున్నాం..కానీ ఆ రెండు సినిమాల కాపీ నా ఇది ?

 

Visitors Are Also Reading