Home » వామ్మో ఫస్ట్ లుక్ చూసి కేక అనుకున్నాం..కానీ ఆ రెండు సినిమాల కాపీ నా ఇది ?

వామ్మో ఫస్ట్ లుక్ చూసి కేక అనుకున్నాం..కానీ ఆ రెండు సినిమాల కాపీ నా ఇది ?

by AJAY
Ad

త‌మిళ స్టార్ హీరో టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి కాంబినేషన్ లో వార‌సుడు అనే సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా మొద‌లైంది. ఇక విజ‌య్ పుట్టిన‌రోజు సంధ‌ర్బంగా ఈ సినిమా నుండి వ‌ర‌స పోస్ట‌ర్ లను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేస్తోంది. ఈ సినిమా పోస్ట‌ర్ లో విజ‌య్ సూట్ తో స్టైలిష్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. ది బాస్ రిటర్న్స్ అనే ట్యాగ్ లైన్ తో పోస్ట‌ర్ క‌నిపిస్తోంది.

Advertisement

 

అయితే ఈ సినిమా పోస్టర్ ల‌ను బ‌ట్టి సినిమా క‌థ ఇదేనంటూ కొంత‌మంది నెటిజ‌న్లు ఊహాగానాలు మొద‌లెట్టారు. ఈ సినిమా పోస్ట‌ర్ లు చూస్తుంటే వంశీపైడిప‌ల్లి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వ‌చ్చిన బృందావ‌నం సినిమా గుర్తుకువ‌స్తుంద‌ని అంటున్నారు. అంతే కాకుండా మ‌రికొంద‌రు సినిమా పోస్ట‌ర్ చూస్తే ర‌జినీకాంత్ హీరోగా న‌టించిన అరుణాచ‌లం సినిమా గుర్తుకువ‌స్తుంద‌ని చెబుతున్నారు.

Advertisement

నెటిజ‌న్ లు ఊహ‌ల ప్ర‌కారంగా హీరో ఒక్క‌డో పుడ‌తాడు ఓ ఊరికి చేరుకుంటాడు. అక్క‌డ ఓ ఫ్యామిలీలో చేర‌తాడు అంతే కాకుండా ఆ కుటుంబం స‌మ‌స్య‌ల‌ను ఆ ఊరిలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను త‌న స‌మ‌స్య‌లుగా భావించి ప‌రిష్కారం చూపిస్తాడు. ఇదే సినిమా క‌థ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇలాంటి క‌థ‌లు చాలా వ‌చ్చాయని ఇది రొట్ట రొటీన్ క‌థ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు ఈ సినిమా మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన మ‌హ‌ర్షిని పోలి ఉంటుంద‌ని కూడా కామెంట్లు చేస్తున్నారు. అందులో రైతుల కోసం సీఈఓ వ‌స్తే ఇక్క‌డ కుటుంబం కోసం సీఈవో వ‌స్తాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమా అస‌లు క‌థ ఏంటి..? వంశీపైడిప‌ల్లి ట్రోలర్స్ కు ఎలా స‌మాధానం చెబుతాడు అన్న‌ది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading