దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. నువ్వు ఒక Ve శ్య అంటూ రియానుద్దేశించి హిందీలో ట్వీట్ చేసింది. రియా తాను సినిమాల్లో నటిస్తున్నట్టు ప్రకటించడంతో ప్రియాంకసింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రియా వెనుక పాలకులు ఉన్నందుకే భయపడటం లేదని ఆరోపిస్తోంది ప్రియాంక.
Also Read : గీతాంజలి చిత్రంలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన నటి ఎవరో తెలుసా ?
Advertisement
ప్రియాంక ట్వీట్ లో రాస్తూ.. మీరు ఎందుకు భయపడతారు ? మీరు చేసే వృత్తి అదే.. ఎప్పటికీ అలాగే కొనసాగుతారు. మీకు మద్దతు ఇస్తున్న పాలకులను చూసే నీకు అంత ధైర్యం అంటూ పోస్ట్ చేసింది. సుశాంత్ కేసు విచారణలో ఆలస్యానికి బాధ్యులు ఎవ్వరో తనకు తెలుసు అని ప్రియాంక పేర్కొంది. కొద్ది సేపటికే తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి ట్వీట్ చేయలేదని స్పస్టం చేసింది. రియా చక్రవర్తి తిరిగి రోడీస్ 19 షోలో నటిస్తున్నట్టు ప్రకటించింది.
Advertisement
Also Read : పవన్ కి జోడీగా గ్యాంగ్ లీడర్ బ్యూటీ.. షూటింగ్ ఎప్పుడంటే ?
పోయినా వారు ఎలాగో తిరిగి రారు.. కానీ ఇప్పుడు ఎందుకు భయపడాలి ? అలా భయపడేవారు వేరే విధంగా ఉంటారు అంటూ రియా మాట్లాడింది. సుశాంత్ మరణించడంతో అతని గర్ల్ ఫ్రెండ్ రియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సూసైడ్ కి ముందు సుశాంత్ రియా రిలేషన్ షిప్ లో ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14, 2020న బాంద్రా నివాసంలో ఆ**త్య చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యులు ఆ**త్య కు ప్రేరేపించేలా చేసిందంటూ రియాపై కేసు నమోదు చేసారు. రియా బెయిల్ పై విడుదల అయినప్పటికీ సీబీఐ, ఈడీ, ఎన్సీబీ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
Also Read : Chiru ఈ సినిమా కారణంగా రవితేజ తన పేరు మార్చుకున్నాడని మీకు తెలుసా?