Home » Chiru ఈ సినిమా కార‌ణంగా ర‌వితేజ త‌న పేరు మార్చుకున్నాడ‌ని మీకు తెలుసా?

Chiru ఈ సినిమా కార‌ణంగా ర‌వితేజ త‌న పేరు మార్చుకున్నాడ‌ని మీకు తెలుసా?

by Azhar
Ad

మాస్ మ‌హారాజా ర‌వితేజ అస‌లు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. ర‌వితేజ చిరంజీవికి వీరాభిమాని అందుకే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందే త‌న పేరును ర‌విశంక‌ర్ రాజు నుండి ర‌వితేజ‌గా మార్చుకున్నాడు. ఈ పేరు మార్పుకు కార‌ణం చిరంజీవి న‌టించిన దొంగమొగుడు సినిమా!


యండ‌మూరి వీరేంధ్ర‌నాథ్ ర‌చించిన ‘నల్లంచు తెల్లచీర’ నవల ఆధారంగా కోదండ‌రామిరెడ్డి డైరెక్ష‌న్ లో చిరంజీవి, మాధ‌వి, భానుప్రియ‌, రాధిక‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన దొంగ‌మొగుడు సినిమాలో చిరంజీవి ద్విపాత్రిభిన‌యం చేశాడు. అందులో ఒక పాత్ర నాగ‌రాజు అయితే మ‌రో పాత్ర ర‌వితేజ!

Advertisement

Advertisement

ఈ సినిమాలోని ర‌వితేజ అనే పాత్ర న‌చ్చి ర‌విశంక‌ర్ రాజు త‌న పేరును ర‌వితేజ‌గా మార్చుకున్నాడు. ఈ సినిమాతో పాటు ఆ పేరు పెట్టుకున్న ర‌వితేజ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. మొద‌ట కృష్ణ‌వంశీ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా త‌న కెరీర్ ను స్టార్ట్ చేసిన ర‌వితేజ అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా మారాడు.!

Also Read: Tollywood కు పూరీ ప‌రిచ‌యం చేసిన 10మంది హీరోయిన్స్ !

Visitors Are Also Reading