Home » వెంక‌టేష్ సూర్య‌వంశం సినిమాలో న‌టించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.!

వెంక‌టేష్ సూర్య‌వంశం సినిమాలో న‌టించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.!

by AJAY

ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా న‌టించిన చాలా మంది పిల్ల‌లు ఇప్పుడు గుర్తుప‌ట్టలేనంత‌గా మారిపోయారు. అంతే కాకుండా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ప్ర‌స్తుతం హీరోలు హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత‌మంది సినిమాల్లో కాకుండా ఇత‌ర రంగాల‌లో స్థిర‌ప‌డ్డారు. కాగా తాజాగా ఒక‌ప్ప‌టి చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. శ్రీకాంత్ హీరోగా న‌టించిన సూర్య‌వంశం సినిమా చాలా మందికి ఫేవ‌రెట్ సినిమా.

అయితే ఈ సినిమాలో వెంక‌టేష్ డ్యూయ‌ల్ రోల్ చేశారు. ఇక ఈ సినిమాలో సీనియ‌ర్ వెంక‌టేష్ కు మ‌న‌వ‌డిగా న‌టించిన బుడ్డోడు త‌న న‌ట‌న‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆ బుడ్డోడి పేరు ఆనంద్ వ‌ర్ద‌న్ కాగా ప్ర‌స్తుతం ఆనంద్ వ‌ర్ద‌న్ లేటెస్ట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కేవ‌లం సూర్య‌వంశం సినిమాలోనే కాకుండా ఆనంద్ వ‌ర్ద‌న్ మ‌న‌సంతానువ్వే, మా విడాకులు, ప్రియ‌రాగాలు, బాల‌రామాయ‌ణం సినిమాల‌లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించాడు.

ఇంద్ర సినిమాలో కూడా త‌న క్యూట్ మాట‌ల‌తో మ‌రియు న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. అంతేకాకుండా ర‌వితేజ బ్ర‌హ్మానందం క‌లిసి న‌టించిన తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేష సినిమాలో కూడా బుడ్డోడు మంచి పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాలో కూడా త‌న న‌ట‌న‌తో న‌వ్వులు పూయించాడు.

అయితే ఆనంద్ వ‌ర్ద‌న్ ఎవ‌రో కాదు ప్లేబ్యాక్ సింగ‌ర్ పిబి శ్రీనివాస్ కు మ‌న‌వ‌డు అవుతాడు. ఇక ఆనంద్ వ‌ర్ద‌న్ చివ‌ర‌గా నేనున్నాను సినిమాలో 2004లో క‌నిపించాడు. ఆ త‌ర‌వాత సినిమాల‌కు దూరం అయ్యాడు. కాగా ప్ర‌స్తుతం ఆనంద్ వ‌ర్ద‌న్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ALSO READ : పేపర్ కప్పులో టీ తాగితే అంత డేంజరా?

Visitors Are Also Reading