ఐసీసీ పురుషుల టీ-20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ లు ఉత్తమ స్థానాలు దక్కించుకున్నారు. వెస్టిండిస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వారు అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ఇద్దరూ ప్రయోజనం పొందారు. ఈ సిరిస్ నుంచి భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. మరొకవైపు భారత బ్యాట్స్మెన్లలో వెంకటేస్ అయ్యర్ చేసిన పరుగులు రెండవ స్థానంలో ఉన్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ 35 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకున్నాడు. మరొకవైపు వెంకటేష్ 203 స్థానాలు ఎగబాకి 115వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Also Read : టీమిండియాకు మరొక ఎదురుదెబ్బ.. శ్రీలంక టూర్‌కు ఆ స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం
Advertisement
Advertisement
టీమిండియా ఓపెనర్ కే.ఎల్.రాహుల్‌కు మాత్రం కష్టాలు తప్పలేదు. రెండు స్థానాలు దిగజారి ఆరవ స్థానానికి చేరుకున్నాడు. అయినా రాహుల్ ఇప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 10 వ స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్లు, ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-10లో ఏ భారతీయ ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేదు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 20వ ర్యాంకులో ఉన్నాడు. ప్రస్తుతం భారతీయ బౌలర్‌కైనా ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్.
ఇక టెస్ట్ విషయానికి వస్తే.. భారత తాజా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆరవ స్థానాన్ని నిలబెట్టుకోగా.. కోహ్లీ ఒక స్థానం వెనుకబడి ఏడవ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బౌలర్ల జాబితాలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ జస్ప్రిత్ బుమ్రా వరుసగా రెండు, 10వ స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండ్ల జాబితాలో అశ్విన్ రెండవ ర్యాంకు కొనసాగించగా.. రవీంద్ర జడేజా మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా మధ్య జరిగి మొదటి టెస్ట్ తరువాత కైల్ జెమిసన్, టిమ్ సౌథీలు వరుసగా మూడు, ఐదుస్థానాలకు ఎగబాకారు.
Also Read : సాహా భయపడకు.. ధైర్యంగా అతని పేరు చెప్పేసేయ్ : సెహ్వాగ్