Telugu News » Blog » జ్యోతిక‌తో తొలి ప‌రిచ‌యం ఎలా అయిందో చెప్పిన సూర్య‌..ఆ సినిమా త‌రువాతే ప్రేమలో ప‌డ్డారా..?

జ్యోతిక‌తో తొలి ప‌రిచ‌యం ఎలా అయిందో చెప్పిన సూర్య‌..ఆ సినిమా త‌రువాతే ప్రేమలో ప‌డ్డారా..?

by Anji
Ads

త‌మిళ హీరో సూర్య గురించి తెలియ‌ని వారు ఎవ్వ‌రుండ‌రు. అత‌ను త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ తెలుగు వారు కూడా మ‌న‌వాడే అనుకునేంత‌గా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ప్ర‌ధానంగా తెలుగులో గ‌జిని సినిమాతో పాపుల‌ర్ అయ్యాడు. ఇప్ప‌టివ‌ర‌కు డైరెక్ట్ తెలుగు సినిమా చేయక‌పోయిన‌ప్ప‌టికీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. గ‌జిని సినిమా త‌రువాత తెలుగులో య‌ముడు సిరీస్‌తో సూర్య‌ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఇటీవ‌ల త‌న ప్రేమ గురించి, జ్యోతిక‌తో ప‌రిచ‌యం గురించి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.


ముఖ్యంగా ద‌ర్శ‌కుడు వ‌సంత్ ద‌ర్శ‌క‌త్వంలో పోవెళ్లం కెట్టుప్ప‌ర్ అనే సినిమాలో తొలుత జ్యోతిక‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. తొలుత వీరిద్ద‌రినీ వ‌సంత్ గారే ప‌రిచ‌యం చేశారు. ఇక తొలి స‌న్నివేశంలో ఇద్ద‌రు చేయి ప‌ట్టుకుని లాంగ మార్చ్ చేయ‌డం ఆ సినిమాలో ప‌రిచ‌యం మాత్ర‌మే. ఆ త‌రువాత మ‌రొక రెండు సినిమాలు చేశామ‌ని చెప్పుకొచ్చాడు. ఇక సూర్య మూడ‌వ సినిమా కాకా కాకా సినిమా హిట్ అయింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డ‌మే కాకుండా నాకు జ్యోతిక‌ను కూడా ఇచ్చింద‌ని సూర్య చెప్పుకొచ్చాడు.

ఇక ఈ చిత్రం త‌రువాత మేమిద్దరం ప్రేమించుకోవ‌డం ప్రారంభించాం. తొలుత ఎవ్వ‌రూ ప్ర‌పోజ్ చేశార‌ని ప్ర‌శ్నించ‌గా తానే జ్యోతిక‌కు ప్ర‌పోజ్ చేసినట్టు సూర్య చెప్పారు. పెళ్లి విష‌యంలో మాత్రం సూర్య సోద‌రి బృంద త‌న త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించార‌ట‌. సినిమాల గురించి ఇంట్లో అస‌లు చ‌ర్చించ‌మ‌ని సూర్య చెప్పారు. దియాకు మంచి తండ్రిగా ఉండాల‌ని ఎల్ల‌ప్పుడు ప్ర‌య‌త్నిస్తానని సూర్య చెప్పారు. పెళ్లి త‌రువాత జ్యోతిక నా జీవితాన్నే మార్చేసిదంటూ చెప్పారు. ముఖ్యంగా జ్యోతిక నాకు ఏమి కావాలో ముందే ఆలోచించి న‌న్ను స‌ర్‌ప్రైజ్ చేస్తుందంటూ వారి బంధంలోని కొన్ని మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌ను సూర్య షేర్ చేసుకున్నాడు.

Also Read : 

న‌టి మీన భ‌ర్త ఆక‌స్మిక మ‌ర‌ణం.. విషాదంలో సినిమా ఇండ‌స్ట్రీ..!

బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్ముతూ ద‌ర్శ‌కుడికి దొరికిన ఆ స్టార్‌ క‌మెడియ‌న్‌..!


You may also like