Home » న‌టి మీన భ‌ర్త ఆక‌స్మిక మ‌ర‌ణం.. విషాదంలో సినిమా ఇండ‌స్ట్రీ..!

న‌టి మీన భ‌ర్త ఆక‌స్మిక మ‌ర‌ణం.. విషాదంలో సినిమా ఇండ‌స్ట్రీ..!

by Anji
Ad

ప్ర‌ముఖ సినీ న‌టి మీన తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాను ప్రాణానికి ప్రాణంగా భావించే భ‌ర్త విద్యాసాగ‌ర్ ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డంతో ఆమె షాక్ కు గురైంది. మీన భ‌ర్త మృతి వార్త‌తో ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. శోక‌సంద్రంలో మునిగిపోయిన ఆమెకు అభిమానులు, స‌న్నిహితులు, స్నేహితులు సోష‌ల్ మీడియాలో సంతాపం ప్ర‌కటిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. ద‌క్షిణాది చ‌ల‌న చిత్ర‌సీమ‌లో ప్ర‌ధానంగా తెలుగులో అగ్ర‌హీరోయిన్‌గా రాణించింది మీన‌.

Advertisement

2009లో జులై 12న ఆర్య స‌మాజ్ క‌ల్యాణ మండ‌పంలో సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ విద్యాసాగ‌ర్‌తో మీన‌కు పెళ్లి జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు నిహారిక అనే కూతురు క‌ల‌దు. విద్యాసాగ‌ర్ కొన్ని సంవ‌త్స‌రాలుగా లివ‌ర్ ఇన్‌ఫెక్ష‌న్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న ఆరోగ్యం విష‌మించి చెన్నైలోని ఓ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఈ వ్యాది పావురాల మ‌ల‌, మూత్ర విస‌ర్జ‌న వ‌ల్ల సోకింద‌ని వైద్యులు వెల్ల‌డించారు. కొద్ది నెల‌లుగా ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌మ‌వ్వ‌డంతో నిపుణులైన వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందారు. జ‌న‌వ‌రి నెల‌లో లివ‌ర్‌లో ఇన్‌ఫెక్ష‌న్ మ‌రింత పెరిగింది. అదేవిధంగా జ‌న‌వ‌రిలో కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డ్డారు.

Advertisement

ఆ త‌రువాత విద్యాసాగ‌ర్‌కు ఇన్‌ఫెక్ష‌న్ మ‌రింత పెరిగింది. క‌రోనాతో కోలుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న ఆరోగ్యం విష‌మించిందని హాస్పిట‌ల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. విద్యాసాగ‌ర్ ఆరోగ్యం విష‌మించిన త‌రుణంలో ఆయ‌న‌కు ఊపిరితిత్తుల ట్రాన్స్‌ఫ్లాంటేష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించారు. బ్రెయిన్ డెడ్ వ్య‌క్తి దొరికితే ఈ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయాల‌ని వైద్యులు ఎదురు చూసారు. అలాంటి వ్య‌క్తి ల‌భించ‌క‌పోవ‌డంతో ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగ‌లేదు. ఆరోగ్యం విష‌మించ‌డంతో జూన్ 28న రాత్రి మృతి చెందారు. విద్యాసాగ‌ర్ మృతి చెందాడ‌నే వార్త సినీ వ‌ర్గాల‌ను, సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను క‌లిచివేసింది. మీన‌కు, ఆమె కుమార్తె నిహారిక‌కు సోష‌ల్ మీడియాలో ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. నిహారిక ఇటీవ‌లే థెరి సినిమాతో ప్ర‌వేశం చేసింది. ఇవాళ చెన్నైలోఅత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు స‌న్నిహితులు తెలిపారు.

Also Read : 

పాటల రచయిత ఆత్రేయ చివరి రోజుల్లో అంతటి దుస్థితిని అనుభవించారా…?డబ్బుల కోసం చివరికి….!

“ఛత్రపతి” సినిమా సూరీడు గుర్తున్నాడా…? ఇప్పుడు ఎంత మారిపోయాడో చూడండి…!

 

Visitors Are Also Reading