తమిళ్ హీరో విజయ్ నటించిన ‘వరిసు’ సినిమాని తెలుగులో ‘ వారసుడు’గా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించేశారు. కానీ సంక్రాంతికి తెలుగు సినిమాలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలంటూ, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఇటీవల ఘాటుగా డిస్ట్రిబ్యూటర్స్ కి లేఖ రాసింది. దాంతో తమిళ్ డబ్బింగ్ సినిమా గా రాబోతున్న వరిసు మూవీస్ తెలుగులో సంక్రాంతికి రిలీజ్ అవ్వడం పై సందిగ్ధత నెలకొంది.
READ ALSO : హీరోయిన్ చాందిని చౌదరికి వాట్సాప్ లో వేధింపులు.. ఫొటోస్ వైరల్
Advertisement
Advertisement
అయితే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నిర్మాతల మండలి నిర్ణయం పై స్పందించారు. ఇతర భాషల సినిమాలను ఎవరు ఆపలేరని, సంక్రాంతి సీజన్ లో అన్ని సినిమాలు నడుస్తాయన్నారు. తెలుగు సినిమాలకు హద్దులు లేవని, చెరిగిపోయాయని, మన సినిమాను ఏ భాషలో కూడా చులకనగా చూడటం లేదన్నారు.
చెన్నైలో ఆర్ఆర్ఆర్ విడుదల చేసినప్పుడు కూడా అక్కడివారు ఇబ్బంది పడ్డారని, స్థానికంగా చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయని, మంచి సినిమా అయితే ఎక్కువ థియేటర్లలో ఆడిస్తారన్నారు. ఇదొక వ్యాపారం అన్నారు. ఎవరిష్టం వారిదని, ఆడుతుందనే నమ్మకం ఉన్న సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇస్తారని, అది ఏ భాష సినిమా అయినా ఎవరూ చూడరన్నారు. మన తెలుగు సినిమాలు కూడా ఇతర భాషలో విడుదలై విజయం సాధిస్తున్నయన్నారు.
ఇవి కూడా చదవండి : Kangana Ranaut : చంద్రముఖిగా మారనున్న కాంట్రావర్సీ క్విన్.. లారెన్స్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ..