Home » లవర్ ను పరిచయం చేసిన సూరేఖవాణి కూతురు…!

లవర్ ను పరిచయం చేసిన సూరేఖవాణి కూతురు…!

by AJAY
Ad

టాలీవుడ్ నటి సురేఖ వాణి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సురేఖ వాణి ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. ఢీ సినిమాలో చిట్టి నాయుడికి తల్లిగా నటించి ఆకట్టుకుంది. కామెడీ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో నటనతో అలరిస్తుంది. ఇక సినిమాల్లో అక్క వదిన క్యారెక్టర్ లతో పాటూ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ సురేఖ వాణి అలరిస్తోంది.

Advertisement

సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ సురేఖ వాణి కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చిట్టి పొట్టి బట్టలతో సురేఖ వాణి వీడియోలు చేస్తూ ఫోటోలు దిగుతూ యూత్ మతి పోగొడుతుంది. అంతే కాకుండా సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సినిమాల్లోకి రాకుండానే సోషల్ మీడియా స్టార్ గా మారింది.

Advertisement

suprithanaidu

తల్లితో వీడియోలు చేస్తూ బుల్లి సెలబ్రిటీ గా మారిపోయింది. రీల్స్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ యూత్ ను ఫిదా చేస్తోంది. అయితే సుప్రీత తాజాగా తన లైఫ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. నేను ఎస్ చెప్పాను అంటూ బాయ్ ఫ్రెండ్ ఫోటోను షేర్ చేసింది. ఇక సుప్రీత ఫోటోకు నెటిజన్లు హ్యాపీగా ఉండండి… విడి పోకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Visitors Are Also Reading