సాధారణంగా మల్టీ స్టారర్ ని డీల్ చేస్తున్నప్పుడు చాలా రిస్క్ ఉంటుందనే చెప్పవచ్చు. ఇద్దరు హీరోలలో ఏ ఒక్క హీరో అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నా వాటిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. సరిగ్గా 1993లో అలాంటిదే జరిగింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ- నాగార్జున కాంబోలో మురళీ మోహన్ భారీ బడ్జెట్ తో వారసుడు సినిమా తీశారు. మలయాళంలో వచ్చిన పరంపర, హిందీలో వచ్చిన ఫూల్ ఔర్ కాంటేలకు రీమోక్ గా రూపొందింది. వారసుడు చిత్రంలో హీరోయిన్ నగ్మా, కీరవాణి సంగీతం ఆకర్షణగా నిలిచాయి.
Advertisement
డాన్ అయిన తండ్రికి అతని పొడ ఏ మాత్రం గిట్టని కొడుకుకి మధ్య జరిగే సంఘర్షణగా తెరకెక్కింది.అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. విడుదలైన సమయంలో కృష్ణ పాత్రకు డిజైన్ చేసి ట్రీట్ మెంట్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఓ సన్నివేశంలో నాగార్జున కృష్ణ కాలర్ పట్టుకోవడం, క్లైమాక్స్ లో కృష్ణ పోషించిన ధర్మతేజ పాత్ర చనిపోవడం ఇవన్ని వాళ్ల మనోభావాలను దెబ్బతీశాయి. కొన్ని ప్రధాన సెంటర్లలో కృష్ణ అభిమానులు నిరసన కూడా చేశారు. చివరికీ ఈవీవీ సత్యనారాయణ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి షూటింగ్ సమయంలోనే రెండు క్లైమాక్స్ చిత్రీకరించేవారని అప్పట్లో మీడియాలో చెప్పుకునే వారు. థియేటర్లో మాత్రం కృష్ణ పాత్రకు సాడ్ ఎండింగ్ ఉంటుంది.
Advertisement
తొలుత ఈ సినిమాకి వ్యతిరేకత వచ్చినప్పటికీ కృష్ణ సైతం కథ ప్రకారం.. తప్ప దీనికి మరో కారణం లేదని సర్ది చెప్పడంతో అభిమానులు శాంతించారు. వీటి సంగతి ఎలా ఉన్నా ఫైనల్ గా వారసుడు ఘన విజయం సొంతం చేసుకుంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్ని అంశాలు ఉన్న చిత్రం కావడంతో క్లాస్ మాస్ ఆదరణ దక్కింది. ఇందులో స్టూడెంట్ విలన్ గా శ్రీకాంత్ నటించారు. మూడేళ్ల తరువాత 1996లో నాగార్జున-కృష్ణ కలిసి మళ్లీ రాముడొచ్చాడు సినిమాలో నటించారు. ఫ్లాష్ బ్యాక్ లోనే కృష్ణ పాత్ర చనిపోతుంది. అప్పుడు వారసుడు తరహాలో నిరసనలు ఎక్కువగా రాలేదు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. తెలుగులో మల్టీస్టారర్స్ సినిమాలో చనిపోయినట్టు తెరకెక్కిస్తే.. ఇప్పటికీ కూడా ఆ సినిమాలు డిజాస్టర్ గానే మిగులుతుండడం విశేషం.
Also Read : కృష్ణ తన కూతురు వివాహానికి సీఎం జయలలితను రావద్దని చెప్పిన కృష్ణ..అలా ఎందుకు చేశారంటే..?