Home » సూపర్ స్టార్ రజినీకాంత్ కి గుడి కట్టి, విగ్రహం పెట్టిన వీరాభిమాని.. వీడియో వైరల్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ కి గుడి కట్టి, విగ్రహం పెట్టిన వీరాభిమాని.. వీడియో వైరల్..!

by Anji
Ad

సినిమా హీరోలు, హీరోయిన్లకు వీరాభిమానులు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే వారిలో కొందరూ మాత్రం తమకు నచ్చిన నటీ, నటులకు గుండెల్లో గుడి కట్టుకుంటారు. మరికొందరూ వారి గ్రామాల్లో గుడికట్టి పూజిస్తుంటారు. గతంలో ఇలాంటి వీరాభిమానుల సంఖ్య చాలా తక్కువగానే ఉండేది.కానీ ఇప్పుడు సినిమా తారలకు గుడి నిర్మించి పూజించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఓ అభిమాని గుడి నిర్మించాడు. అందులో 250 కేజీల బరువు అయిన రజినీకాంత్ విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

Advertisement

తమ కుటుంబంలో ఐదు తరాలుగా తలైవా అభిమానిస్తూ వస్తున్నామని చెప్పాడు. మధురైకి చెందిన కార్తీక్ అనే అభిమాని. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తలైవా సినిమా విడుదలకు విదేశాల నుంచి భారత్ కి వచ్చి చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. రజినీకాంత్ ని రాజకీయాల్లో చూడాలని లక్షలాది మంది ఫ్యాన్స్ ఆశపడ్డారు. తమిళనాడు మదురైకి చెందిన కార్తీక్ అనే ఓ వీరాభిమాని మాత్రం రజినీకాంత్ తన దేవుడిగా కొలుస్తున్నాడు. తలైవా తనకు దేవుడితో సమానమని చెప్పడమే కాకుండా.. రజినీ విగ్రహాన్ని తయారు చేయించి.. ఓ గుడి నిర్మించాడు. రజినీకాంత్ పై తనకు ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకొని వార్తల్లో నిలిచాడు కార్తీక్.  దాదాపు 70 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ ఇంకా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు రజినీకాంత్.

Advertisement

తమ అభిమాన హీరో కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. ఇటీవలే విడుదలై రికార్డులు బ్రేక్ చేసిన జైలర్ తో తలైవా మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. అందుకేనేమో మధురై కి చెందిన కార్తీక్ అనే వీరాభిమాని రజినీకాంత్ కోసం గుడి కట్టించాడు. రజినీకాంత్ కి గుడి కట్టించిన విషయాన్ని అభిమాన కార్తీక్ గర్వంగా చెబుతున్నాడు. తాను రజినీకాంత్ సినిమాలు తప్ప వేరే ఏ సినిమాలు చూడనని.. తానే కాదు తమ కుటుంబంలో గత ఐదు తరాలుగా ఆయననే అభిమానిస్తున్నామని రజినీకాంత్ తమకు దైవంతో సమానం అంటున్నారు. కేవలం ఇతనే కాదు.. ఏపీలోని బాపట్లలో నటి సమంతకు గుడి కట్టాడు ఓ అభిమాని. వీరందరూ సినీ తరాలపై ఉన్న అభిమానంతో గుడి కడుతున్నారా లేక వార్తల్లో నిలవడానికి ఈ విధంగా చేస్తున్నారో అనేది అర్థం కావడం లేదు. 

మరిన్ని  సినిమా వార్తల  కోసం ఇక్కడ చూడండి !    తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading