Home » సూపర్ స్టార్ రజనీకాంత్ భార్యలతకు విడాకులు ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటించారంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్యలతకు విడాకులు ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటించారంటే..?

by Sravanthi
Ad

వివాహ బంధం అనేది చాలా గొప్పది. రెండు మనసులు ఏడు అడుగులు మూడు ముళ్ళతో ఏకమయ్యే ఈ బంధానికి సమాజంలో చాలా మంచి గుర్తింపు ఉంటుంది. విహాహం తర్వాత చాలామందికి రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అయితే కొంతమంది వివాహం తర్వాత దంపతుల మధ్య సఖ్యత కుదరక విడిపోయే ఘటనలు ఎన్నో చూస్తున్నాం. సాధారణ వ్యక్తుల మధ్య ఇలా ఉంటే.. సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి దంపతుల మధ్య విడాకుల తంతు ఎక్కువగా నడుస్తుంది.

Advertisement

also read:ఆయన ఉంటే సినిమా చేయనంటూ కళ్ళు చిదంబరంను దారుణంగా అవమానించిన హీరోయిన్ శ్రీదేవి..!!

ఇప్పటికే ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. మొన్నటి వరకు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నారని ప్రకటించారు. ఈ విషయం విని అందరూ ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ ఈ మధ్య కాలంలోనే మళ్లీ కలిసిపోతున్నట్టు ప్రకటించారు. కట్ చేస్తే.. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇలాగే భార్య లతకు విడాకులు ఇద్దామని అనుకున్నారట. ఆయన తన భార్యకు దూరం కూడా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయట.. పూర్తి వివరాలు ఏంటంటే 1985 రజనీకాంత్ భార్య లత కొంతకాలం వేర్వేరుగా ఉంటున్నారని త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని కొన్ని తమిళ పత్రికలు రాశాయి.

Advertisement

అప్పట్లో హరేకృష్ణ మూమెంట్ లో చేరిన రజిని పూర్తిగా దానికి అంకితమై పోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి అప్పట్లో వార్తలు రాశారు. ఇదే విషయంపై రజనీకాంత్ ను అడగగా.. నేను నా భార్య లతా వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాం.. అంతకుమించి మా మధ్య ఎలాంటి ద్వేష భావన లేదు అని చెప్పారు.

ఆ తర్వాత కొంతకాలానికి వారి మనస్పర్ధలు తొలగిపోయాయి. అప్పుడు రజనీకాంత్ శ్రీ రాఘవేంద్ర అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. రజనీకాంత్ కెరియర్లో అది 100వ సినిమా. ఈ సమయంలోనే ఆయన కాస్త ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెట్టారని అంటుంటారు. అయితే సూపర్ స్టార్ భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించడంతో అప్పట్లో పెద్ద సంచలనమైంది.

also read:

Visitors Are Also Reading