Telugu News » Blog » ఆయన ఉంటే సినిమా చేయనంటూ కళ్ళు చిదంబరంను దారుణంగా అవమానించిన హీరోయిన్ శ్రీదేవి..!!

ఆయన ఉంటే సినిమా చేయనంటూ కళ్ళు చిదంబరంను దారుణంగా అవమానించిన హీరోయిన్ శ్రీదేవి..!!

by Sravanthi Pandrala Pandrala

ఇండస్ట్రీలో ఉన్నటువంటి అప్పటి కమెడియన్లలో కళ్ళు చిదంబరం కామెడీ చాలా డిఫరెంట్. ఆయనను తెరపై చూస్తే చాలు పగలబడి నవ్వేవారు. అలాంటి కళ్ళు చిదంబరం ఇండస్ట్రీలోకి రావడానికి అనేక కష్టాలు పడ్డారు. ఆయన ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాలో నటిస్తూ చాలా కష్టపడేవారు. కళ్ళు అనే సినిమా ద్వారా మొదటిసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.దీనితో ఈ సినిమా పేరు ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఈ ఒక్క సినిమా చేసి ఆగిపోదామనుకున్న చిదంబరంకు వరుస సినిమా ఆఫర్లు రావడంతో దాదాపుగా 300 కి పైగా చిత్రాల్లో నటించారు.

also read:మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. సింగర్ కి సాయం

Advertisement

ఈ విధంగా ఎంతో కష్టపడి అయినా బాగానే సంపాదించారు. అలాంటి చిదంబరం ఒకరోజు “గోవిందా గోవిందా” అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున,శ్రీదేవి హీరో హీరోయిన్లు. ఒక సీన్ లో కళ్ళు చిదంబరంతో శ్రీదేవి నటించాల్సి ఉంది. కానీ ఆమె భయపడిందో ఏమో కానీ ఆ వ్యక్తితో నేను నటించాను అని చెప్పిందట. అప్పటికే చిదంబరం సెట్స్ పైకి వచ్చేసారు. నేను ఈయనతో నటించాను అని రాంగోపాల్ వర్మతో చెప్పిందట. దీంతో వర్మ ఆయన ఎవరనుకుంటున్నావు ఆయన అసిస్టెంట్ ఇంజనీర్ నంది అవార్డు అందుకున్న గొప్ప నటుడు.

ఆయన ఉంటేనే నేను ఈరోజు డైరెక్ట్ చేస్తాను లేదంటే ఈ సినిమా ఇక్కడితోనే ఆపేస్తానని తెగేసి చెప్పారట. వర్మ ఈ విధంగా కోపానికి వచ్చేసరికి సెట్స్ లో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక శ్రీదేవి కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని సినిమాకు ఒప్పుకుందట. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు చిదంబరం.

also read:

You may also like