Home » ఇంటి అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఆ స్టార్ హీరో వారసులు..!!

ఇంటి అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఆ స్టార్ హీరో వారసులు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాటి మేటినటుల్లో ఎంతో గుర్తింపు పొందారు నటుడు కాంతారావు.. అప్పట్లో ఉన్నటువంటి స్టార్ హీరోల్లో ఏఎన్ఆర్,ఎన్టీఆర్,కృష్ణ, శోభన్ బాబు,కృష్ణంరాజు వంటి వాళ్లతో పోటీగా చాలా సినిమాల్లో నటించారు కాంతారావు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన సహాయ నటుడిగా మారారు. అలాంటి కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో జన్మించారు. నిర్దోషి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా, సహాయకుడుగా, విలన్ గా ఎన్నో పాత్రలు చేసి మంచి గుర్తింపు సాధించారు. దాదాపుగా 450 పైగా చిత్రాల్లో నటించారు.

Advertisement

also read:మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. సింగర్ కి సాయం

Advertisement

2007లో వచ్చినటువంటి చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమా ఆయన చివరి చిత్రం. ఆయన రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా అందుకున్నారు. అయితే ఒకానొక సందర్భంలో స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్,ఏఎన్నార్ రెండు కళ్ళలాంటివారు వీరి మధ్యలో తిలకం లాంటి వారు కాంతారావు అంటూ చెప్పుకొచ్చారు. 2009 లో కాంతారావు క్యాన్సర్ తో మృతి చెందారు. ఆయన చనిపోయే టైంకి 85 సంవత్సరాలు. ఇండస్ట్రీలో ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కాంతారావు గారి పిల్లలు ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీనికి ప్రధాన కారణం కాంతారావు చాలా ఆస్తులు సంపాదించారు. కానీ కొన్ని సినిమాలు ఆయన సొంతంగా నిర్మించడం కోసం ఉన్న ఆస్తులను అమ్ముకున్నాడు. ఆ నిర్మించిన సినిమాలు కూడా హిట్టు కాకపోవడంతో అన్నీ పోయాయి. ఒకప్పుడు చెన్నైలో బంగ్లాలో ఉండేవారు ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు వారి వారసులు. వారికి ఒక ఇల్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

also read:

Visitors Are Also Reading