మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానున్న తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేసర్ భువనేశ్వర్ కుమార్ గురువారం ప్రాక్టీస్ శిబిరానికి చేరుకున్నాడు. గత నెలలో బెంగుళూరులో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో అతడిని సన్‌రైజర్స్ జట్టు రూ.4.2 కోట్లకు దక్కించుకుంది.
Advertisement
ఐపీఎల్ మ్యాచ్‌లు క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఎండా కాలంలో ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసే వారు ఎందరో ఉంటారు. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15 సీజన్ ప్రారంభం కానున్నది. దీంతో ఇప్పటి నుంచే అన్ని జట్లు మైదానంలోకి అడుగుపెట్టి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈ తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇంకా బాధపడుతున్నాడని.. అతడు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతుంది.
Advertisement
గత ఏడాదితో భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ఫిట్ గా లేడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోతో కేన్ మామపై వస్తున్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది. తాజాగా విడుదల చేసిన వీడియోలో ప్రాక్టీస్ సెషన్‌లో కేన్ మామ జాలిగా ఆడుతూ కనిపించాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాడు. మరొకవైపు అభిమానులు కేన్ విలియమ్సన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. చుట్టూ ఉన్నా వెలిగే కిరణం అతడే అంటూ కేన్ మామపైనే సన్‌రైజర్స్ అభిమానులు భరోసాతో ఉన్నారు.
Also Read : భీమవరం బరిలో సునీల్…పవన్ తో మీటింగ్ తరవాత క్లారిటీ ఇచ్చేశాడు..!
Advertisement