Home » కమెడియన్ అనే చిన్న చూపు..? త్రిష, అనుష్క ఆనాడు ఏం చేసారంటే..?

కమెడియన్ అనే చిన్న చూపు..? త్రిష, అనుష్క ఆనాడు ఏం చేసారంటే..?

by Sravya
Ad

సునీల్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలామంది టాప్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా సునీల్ నటించి నవ్వించారు. ఉదయ్ కిరణ్ నాగార్జున వెంకటేష్ చాలామంది సినిమాల్లో నటించి కామెడీని పండించారు సునీల్. సొంతం, నువ్వే నువ్వే, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావ్ అలానే మన్మధుడు వంటి సినిమాల్లో సునీల్ కామెడీ చూస్తే ఎవరైనా ఫుల్లు గా నవ్వుతారు తర్వాత హీరోగా సునీల్ కి అవకాశాలు రావడం మొదలయ్యాయి.

Advertisement

మర్యాద రామన్న అందాల రాముడు ఇలా సినిమాల్లో హీరోగా నటించిన కానీ కాలం అయితే కలిసి రాలేదు. సునీల్ ఎక్కువ కాలం హీరోగా కొనసాగించలేకపోయాడు. కొంతవరకు బానే సాగినా తర్వాత మాత్రం ఆయనకి ఫ్లాప్స్ ఏ మిగిలాయి. దీంతో మళ్ళీ సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు కామెడీ రోల్స్ చేస్తూ కథలో కీలకమైన పాత్రలు చేస్తున్నాడు. హీరోగా నటిస్తున్నప్పుడు కొంతమంది స్టార్ హీరోయిన్లు ఆయన సినిమాలు రిజెక్ట్ చేశారు ఆ విషయాన్ని సునీల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

Also read:

కమెడియన్ కనుక హీరోయిన్లు ఎవరైనా చిన్నచూపు చూశారా అని యాంకర్ అడిగితే సునీల్ దానికి సమాధానం ఇలా చెప్పారు. రాజమౌళి మర్యాద రామన్న సినిమాకి హీరోయిన్ సమస్యలు ఎదురయ్యాయి. ఆ సినిమా కోసం ముందు రాజమౌళి అనుష్కని అడిగారు ఆమె రిజెక్ట్ చేశారని సునీల్ చెప్పారు. త్రిష కూడా సినిమా చేయనని చెప్పేసారట. తర్వాత సలోని ని తీసుకున్నట్లు చెప్పారు. అందాల రాముడు మూవీకి హీరోయిన్ సమస్య రాలేదని సునీల్ అన్నారు. ముందుగా దివంగత నటి ఆర్తి అగర్వాల్ ని అనుకున్నాము ఆమెకి కథ బాగా నచ్చింది సినిమా చేయడానికి ఒప్పుకుంది అని చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading