Home » SUNDARAM MASTER REVIEW : సుందరం మాస్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

SUNDARAM MASTER REVIEW : సుందరం మాస్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

by Anji
Published: Last Updated on
Ad

కమెడీయన్ వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన మూవీ సుందరం మాస్టర్. ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

కథ మరియు విశ్లేషణ : 

విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉంటాడు సుందర్ రావు(వైవా హర్ష). పెళ్లి కానీ అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండటంతో కట్నం బాగానే వస్తుందని ఆశతో వచ్చిన సంబంధాలన్నింటీని చెడగొట్టుకుంటూ ఇంకా ఎక్కువ కట్నం వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలాంటి తరుణంలోనే ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్షవర్దన్) అతనికి ఓ ఆసక్తికరమైన పని అప్ప చెబుతాడు. అడవుల్లో ఉండే ఒక గూడానికి వెళ్లి అక్కడ ఉన్న వారికి చదువు చెప్పాలని.. చదువు చెప్పి తరువాత వాళ్లని నియోజకవర్గంలో ఓటర్లుగా చేర్చేందుకు ప్రయత్నించాలని చెబుతాడు. రహస్యంగా మరో పని కూడా అప్పగిస్తాడు. సుందరం మాస్టర్ ఎమ్మెల్యే చెప్పిన పని చేశాడా..? ఆ గూడెం పెద్ద (కేజీఎఫ్ బాలకృష్ణ), మైనా(దివ్య శ్రీపాద) అలాగే ఆ గూడెంలో ఉన్న ఇతరులు సుందరం మాస్టర్ ని అనుమానించి చెట్టుకు కట్టేస్తారు. ఎమ్మెల్యే చెప్పిన పని చేసేందుకు అక్కడికీ వెళ్లిన సుందరం మాస్టర్ చివరికీ ఏం చేశాడు..? రహస్యంగా ఎమ్మెల్యేలు తీసుకురమ్మని చెప్పింది ఏంటి..? అనే వివరాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమాను వీక్షించాల్సిందే. 

Advertisement

 

సినిమా ప్రారంభమైనప్పటికీ ఎక్కువగా నాన్చకుండా సుత్తి లేకుండా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అత్యాశ కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు డీఈవో పోస్ట్ వస్తుందని ఆశపడి అడవిలో గూడానికి వెళ్లి అక్కడ విలువైన ఓ వస్తువు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతాడు. మానవత్వం గురించి యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ సుందరంమాస్టర్. ఈ సినిమాలో ఆలోచన కొత్తగా ఉన్నప్పటికీ హిట్ మార్క్ అందుకోలేదు. మంచి మెస్సెజ్ తో ఈ వీకెండ్ చూసే సినిమా. ఇంటర్వెల్ ముందు నవ్వించినప్పటికీ.. ఆ తరువాత అంతగా కామెడీ చేయలేదు. సెకండాఫ్ అంతా ఫిలాసఫీ ఎక్కువగా ఉంది. సన్నివేశాలను సరిగ్గా తీయడం డైరెక్టర్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. కొన్ని సీన్లు బాగున్నప్పటికీ సినిమాలో సోల్ మిస్ అయింది.  సుందరం మాస్టర్ పాత్రలో హర్ష ఇమిడిపోయాడు. బాలకృష్ణ, దివ్య శ్రీ పాద, హర్షవర్దన్, భద్రం వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. 

పాజిటివ్ పాయింట్స్ : 

  • ఫస్టాప్
  • వైవా హర్ష
  •  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 
  • కామెడీ

మైనస్ పాయింట్స్ : 

  • సెకండాఫ్
  • క్లైమాక్స్
  • డైరెక్టర్

రేటింగ్ : 2.75/5 

Also Read :  చరణ్ గేమ్ చేంజర్ షూట్ వీడియో లీక్.. హెలికాప్టర్ షాట్ సూపర్ అసలు..!

Visitors Are Also Reading