సుకుమార్ భార్య తబిత ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గానే ఉంటుంది. సుకుమార్‌కు సంబంధించిన పలు విషయాలను నిత్యం షేర్ చేస్తుంది. ఇక సుకుమార్ సెట్ లో ఎలా ఉంటాడు..? ఇంట్లో ఎలా ఉంటాడు పిల్లలతో సమయం ఎలా గడుపుతాడనే విషయాలు తబిత షేర్ చేస్తుంటుంది. షూటింగ్‌లతో సుకుమార్ బిజీగా ఉంటూ సోషల్ మీడియాను అసలు పట్టించుకోడు. కానీ సుకుమార్ అభిమానుల కోసం తబిత ఫుల్ యాక్టివ్ అవుతుంటుంది. సుకుమార్ కూడా సందర్భం వచ్చినప్పుడు తన భార్య గురించి ఎంతో గొప్పగా చెబుతుంటాడు.
Advertisement
సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సక్సెస్ మీట్‌తో తన భార్యకే ముందు థ్యాంక్స్ చెప్పి స్పీచ్ ప్రారంభించాడు. తాను లేకపోతే నేను లేనని.. నాలో సగభాగం నా అర్థాంగి అని.. నా సక్సెస్‌లో కూడా ఆమెకు సగ భాగం ఉంటుందని భార్య గురించి గొప్పగా వర్ణించాడు. అది చూసిన తబిత కూడా ఎమోషనల్ అయింది. పుష్ప సినిమా సుకుమార్ గురించి ఓ సుదీర్ఘమైన పోస్ట్ వేసింది. తబిత ఎప్పుడు కూడా సుకుమార్ మీద అమితమైన ప్రేమను పంచుతుంటుంది. తాజాగా ఓ పోస్ట్ చేసింది. సుకుమార్, తబితల పెళ్లి జరిగి నేటికి పదమూడేళ్లు. తబిత ఎమోషనల్ అవుతూ ఓపోస్ట్ వేసింది. ఇవాళ నిన్ను ప్రేమించినంతగా మరి ఏ ఇతర రోజు ప్రేమించలేనేమో అని చెప్పుకొచ్చింది.
Advertisement
ఎందుకంటే ఈరోజు మన పెళ్లి రోజు.. అయితే నీ మీద మాత్రం రోజు రోజుకు ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. మన ఇద్దరం ప్రతిక్షణం ప్రేమలో పడుతుంటం. ఎన్నోసార్లు ప్రేమించుకుంటుండడంతో మన పెళ్లి సక్సెస్ అయి ఉంటుందని నేను నమ్ముతుంటాను. 13 ఏళ్లు గడిచినందుకు సంతోషంగా ఉందని తబిత ఎమోషనల్ అయ్యింది. సుకుమార్ మాత్రం ఇప్పుడు పుష్ప పార్ట్-2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక వచ్చే నెల చివరి వరకు పుష్ప-2ను సెట్స్ మీదకు తీసుకెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రంతో మరొకసారి పాన్ ఇండియన్ స్థాయిలో బన్నీ రేంజ్, సుకుమార్ స్టామినా అందరికీ తెలిసిపోతుంది.
Also Read :
ఈ ఫోటోలో ఉన్న మెగాస్టార్‌ను మీరు గుర్తు పట్టారా..? సోషల్ మీడియాలో వైరల్