Telugu News » Blog » వామ్మో.. ఈ బ‌కాసూరుడికి వండిపెట్ట‌డానికే ఇద్ద‌రు భార్య‌లు.. అతని తిండికి భ‌య‌ప‌డి బంధువులు ఫంక్ష‌న్ల‌కే పిల‌వ‌డం లేద‌ట‌..!

వామ్మో.. ఈ బ‌కాసూరుడికి వండిపెట్ట‌డానికే ఇద్ద‌రు భార్య‌లు.. అతని తిండికి భ‌య‌ప‌డి బంధువులు ఫంక్ష‌న్ల‌కే పిల‌వ‌డం లేద‌ట‌..!

by Anji
Ads

రోజు రోజుకు చాలా మంది ప‌లు అనారోగ్య స‌మ‌స్యల కార‌ణంగా మ‌ర‌ణిస్తున్నార‌ని చాలా మంది ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్య‌త ఇస్తున్న విష‌యం తెలిసిందే. ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు మూలం అయిన‌టువంటి ఊబ‌కాయానికి దూరంగా ఉండాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. ఎక్స‌ర్‌సైజ్‌లు, డైటింగ్ ఇలా అన్నింటిని ఫాలో అవుతుంటారు. అయితే ఓ భారీ కాయుడు.. ఎంత ప్ర‌య‌త్నం చేసినా కానీ బ‌రువు మాత్రం త‌గ్గ‌డం లేద‌ట‌. అత‌ని బ‌రువు ఏకంగా 200 కేజీల‌కు పైగానే ఉన్నాడ‌. అత‌నికి క‌నీసం న‌డ‌వ‌డం కూడా క‌ష్టంగా మారింది. రోజుకు అత‌నికి 15 కేజీల వ‌ర‌కు ఆహారం పొట్ట‌లోకి వెళ్లాల‌ట‌. విచిత్రం ఏమిటంటే.. అత‌ని తిండికి భ‌య‌ప‌డి బంధువులు ఎవ్వ‌రూ కూడా అత‌న్ని ఫంక్ష‌న్ల‌కు పిల‌వ‌డ‌మే మానేశార‌ట‌. ఇంత‌కు అత‌ను ఎవ‌రు..? అత‌ని గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

బీహార్ రాష్ట్రంలోని క‌టిహార్ జిల్లా జ‌య‌న‌గ‌ర్‌కు చెందిన రఫిక్ అద్నాన్ (30) పుట్టిన‌ప్ప‌టి నుంచి ర‌ఫిక్ అధిక ఆహారం తీసుకుంటుండేవాడు. ప్ర‌స్తుతం అత‌ని బ‌రువు 200కేజీల‌కు పైనే ఉంటుంది. ఇప్పుడు అత‌నికి ఆ బ‌రువు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ముఖ్యంగా ఎటు క‌ద‌ల‌లేక ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నాడు. సాధార‌ణ బైకులు అత‌ని బ‌రువు అస్స‌లు మోయ‌లేవు. దీంతో అత‌డు బుల్లెట్ బండినే వాడుతున్నాడు. ర‌ఫిక్ అద్నాన్ అరుదైన వ్యాధి అయిన‌టువంటి బులిమియా నెర్వోసాతో బాధ‌ప‌డుతున్నాడు. ప‌రిమితి లేకుండా ఆహారం తీసుకోవ‌డం ఆ వ్యాధి ల‌క్ష‌ణం. ర‌ఫిక్ ప్ర‌తిరోజు 3 కేజీల బియ్యం, 4 కిలోల గోధుమ‌పిండితో చేసిన రోటీలు, 2 కేజీల మాంసం, 1.5 కేజీల చేప‌లు తింటాడు. వాటితో పాటు రోజులో మూడు సార్లు లీట‌ర్ పాలు తాగుతాడు. మొత్తానికి రోజుకు 14 నుంచి 15 కేజీల ఆహారాన్ని తింటాడు. ఇక ర‌ఫిక్‌కు స‌రిప‌డే వంట చేయ‌డం ఒక మ‌నిషికి సాధ్యం కాదు. అందుకే అత‌ను రెండు పెళ్లిలు చేసుకున్నాడు. భార్య‌లు ఇద్ద‌రూ క‌లిసి ర‌ఫిక్‌కు స‌రిప‌డే వంట చేస్తుంటారు. ఊబ‌కాయం కార‌ణంగా ర‌ఫిక్‌కు సంతానం క‌లుగ‌లేదు. ర‌ఫిక్ తీసుకునే ఆహారం గురించి తెలిసి త‌మ బంధువులు, స్నేహితులు అత‌న్ని శుభ‌కార్యాల‌కు పిల‌వ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. ర‌ఫిక్ త‌న గ్రామంలోసంప‌న్న‌మైన రైతు. దీంతో అత‌నికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేదు.

అత‌నికి చికిత్స అందించే డాక్ట‌ర్ మృణాల్ తాజాగా మీడియాతో మాట్లాడారు. బులిమియా నెర్వోసా అనే వ్యాధి ర‌ఫిక్ ఉంది. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు ఎక్కువ‌గా తింటారు. ఈ వ్యాధిని గుర్తించి స‌కాలంలో చికిత్స ప్రారంభిండం చాలా ముఖ్యమ‌ని.. లేదంటే రోగి ప్రాణం కూడా పోయే ప్ర‌మాదం ఉంది. చాలా నెమ్మ‌దిగా అత‌ను తీసుకునే ఆహారం ప‌రిమాణం త‌గ్గించుకుంటూ రావాల‌ని చెప్పుకొచ్చారు. మెరుగైన చికిత్స కోసం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ, స‌రైన ఆహార ప్ర‌ణాళిక‌తో దీనిని న‌యం చేయొచ్చ‌ని వెల్ల‌డించారు. బులీమియా నెర్వోసా వ్యాధి ఎక్కువ‌గా జ‌న్యుప‌రంగా వ‌స్తుంద‌ని.. కొన్నిసార్లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ఇది క‌లుగుతుంద‌ని, దీని కార‌ణంగా వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న మారుతుంది. ఇక ఆత్మ‌విశ్వాసం కూడా త‌గ్గుతుంది. అక‌స్మాత్తుగా బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం జ‌రుగుతుంది. ఇక ఈ వ్యాధి ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ఉండ‌కూడ‌ద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డైటీషియ‌న్‌, సైకియాట్రిస్ట్ వంటి డాక్ట‌ర్ల‌తో కౌన్సిలింగ్ అవ‌స‌రం.

Also Read : 

ఆర్ఆర్ఆర్ సినిమాలో డిలీట్ చేసిన ఎన్టీఆర్ మూడు సీన్లు ఇవే…!

ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అప్పుడేనా.. వధువు ఎవరో తెలుసా..?

 


You may also like