Home » విరూపాక్ష మూవీలో విలన్ ని మార్చేసిన సుకుమార్.. ఆమెకు ఛాన్స్ మిస్..!

విరూపాక్ష మూవీలో విలన్ ని మార్చేసిన సుకుమార్.. ఆమెకు ఛాన్స్ మిస్..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా విరూపాక్ష. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. అయితే ఆమెను హీరోయిన్ అనడం కంటే విలన్ అనడమే కరెక్టేనేమో.. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది విరూపాక్ష. ముఖ్యంగా ఈ మూవీలో సంయుక్త పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ చూసి ప్రేక్షకుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. అయితే దర్శకుడు కార్తీక్ వర్మ దండు తొలుత రాసుకున్న కథలో విలన్ ఆమె కాదట. 

Advertisement

శ్యామల విలన్ అయితే.. సుకుమార్ రాకతో ఇది మారిపోయింది. విరూపాక్ష మూవీలో కథానాయకుడికి వరుసకు అక్క అయ్యే పాత్రలో యాంకర్ శ్యామల నటించారు. పవిత్ర పాత్రలో కనిపించారు. తొలుత ఆ పాత్రను విలన్ చేసి కార్తీక్ దండు కథ రాశారట. అయితే ఆ కథ అంతా విన్న తరువాత సుకుమార్ స్క్రీన్ ప్లే చేంజ్ చేయడంతో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్ పాత్రను విలన్ చేసేశారు. ఇక ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ వర్మ దండు వెల్లడించారు. సుకుమార్ మార్క్ మార్పులు ఈ మూవీకి భారీ విజయాన్ని అందించాయనే చెప్పవచ్చు. 

Advertisement

సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఆయనకు రెండో సినిమా ఇది. దీని కంటే ముందు నవదీప్ హీరోగా భంబోలేనాథ్ తీశారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో కొన్నాళ్లు పని చేసి విరూపాక్ష తీశారు. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఇటీవలే ఓటీటీలో విడుదలై దూసుకుపోతోంది. సాయిచంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్, సోనియా సింగ్, అభినవ్ గోమఠం, యాంకర్ శ్యామల,  కమల్ కామరాజు వంటివారు కీలక పాత్రల్లో నటించారు. ప్రతీ ఒక్కరూ పాత్రల పరిధి మేరకు చేసారని పేరు తెచ్చుకున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ప్రభాస్ ఫ్యాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే ?

 తెలుగులో నా మొదటి సినిమా ఆ స్టార్ హీరోతో… కానీ అంత ఇస్తేనే చేస్తాను అన్నాను… పాన్నంబలం..!

Vidudala Part 1 Movie : ఓటిటిలోకి వచ్చేసిన విడుదల 1 సినిమా

Visitors Are Also Reading