Home » ప్రభాస్ ఫ్యాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే ?

ప్రభాస్ ఫ్యాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే ?

by Anji
Ad

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన సినిమా మేమ్ ఫేమస్. ఈ సినిమాకి తనే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. అనేక మంది డెబ్యూ టాలెంటేడ్ యువతతో తెరకెక్కించిన ఈ మూవీ మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ విభిన్నంగా ప్రారంభించి.. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. 

Advertisement

ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఆసక్తికరమై ట్వీట్ చేశాడు. మేమ్ ఫేమస్ మూవీ చూసిన ప్రభాస్.. ఈ మూవీ అద్భుతమంటూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఇది ఒక అద్భుతమైన చిత్రం. సినిమాలోని ప్రతీ నటీనటులు నటనకు ఫిదా అయిపోయాను. ముఖ్యంగా రచయిత, దర్శకుడు, నటుడు సుమంత్ ప్రభాస్ ఎంతో ప్రతిభ ఉన్న అబ్బాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో సహా అన్ని క్రాప్ట్స్ ఫర్ఫెక్ట్ గా కుదిరాయి. కొంతమంది డెబ్యూటెంట్స్ కలిసి ఈ మూవీని నిర్మించారనే విషయాన్ని అసలు నమ్మలేకపోతున్నాను. ఈ సినిమా తీసినందుకు నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, యువ  బృందానికి నా అభినందనలు. ఇలాంటి టాలెంట్ కి మద్దతుగా నిలిచినందుకు గర్వంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు మహేష్. 

Advertisement

‘మేమ్ ఫేమస్’  చిత్రాన్ని చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అండ్ లహరి ఫిల్మ్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రు, మనోహరన్ సంయుక్తంగా నిర్మించారు. చాయ్ బిస్కెట్ టీమ్ గతంలో మహేష్ బాబు బీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి మేజర్ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మేమ్ ఫేమస్ సినిమా తెరకెక్కింది. ఇందులో సుమంత్ ప్రభాస్ తో పాటు మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి నటించారు. ఈ సినిమాకి కళ్యాణ్ నాయక్ సంగీతమందించారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అల్లు రామలింగయ్యను సెట్స్ నుండి మెడలు పట్టి బయటకు గెంటేసిన విజయనిర్మల.. ఎందుకంటే..?

 దేవిశ్రీప్రసాద్ దగ్గర ఆ మూవీకి అసిస్టెంట్ గా పని చేసిన థమన్… థమన్ కి అదే చివరి సినిమా..!

Visitors Are Also Reading