Home » సుక్కు మార్క్…వీళ్ల‌ను ఇలా మార్చేశాడేంటి..!

సుక్కు మార్క్…వీళ్ల‌ను ఇలా మార్చేశాడేంటి..!

by AJAY
Ad

ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్స్ న‌డుస్తోంది. టాప్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలంటూ రకరకాల గెటప్పుల్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇది వరకు టాలీవుడ్ లో మాస్… యాక్షన్… ప్రేమకథలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. కొత్త కథలు కొత్త గెటప్ లతో న‌టీన‌టులు అలరిస్తున్నారు. ఇటీవలే వచ్చిన రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ లుక్ మొత్తం మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ బాహుబలి లో పౌరాణిక లుక్ లో కనిపించాడు. అదేవిధంగా కేజిఎఫ్ లో విలన్ లు హీరో గెటప్ లు పూర్తిగా వేరుగా ఉంటాయి. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప సినిమా మాలో నటీనటుల అవతారాలు కూడా పూర్తిగా మారిపోయాయి.

Advertisement

పుష్ప‌ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిదానిలోనూ తన మార్కు ఉండేలా చూసుకునే సుకుమార్ నటీనటుల వేషధారణ లోనూ తన మార్కును ప్రదర్శిస్తున్నారు. పుష్ప నుండి మొదట బన్నీ లుక్ ను రిలీజ్ చేయగా అంతా అవాక్కయ్యారు. సాధారణ లారీ డ్రైవర్ పాత్రలో పుష్ప‌రాజ్ గా బ‌న్నీ నటిస్తున్నాడు. ఇక సినిమాలో శ్రీవల్లి పాత్రలో ర‌ష్మిక మంద‌న నటిస్తుండగా ఆమె లుక్ చూసి కూడా షాక్ అయ్యారు.

Advertisement

అదేవిధంగా సినిమాలో విలన్ గా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పాత్రలో ఫాజిల్ భయంకరంగా క‌నిపిస్తున్నాడు. ఇక సినిమాలో అనసూయ దాక్షాయ‌ని అనే పాత్రలో న‌టిస్తోంది. రీసెంట్ గా అన‌సూయ ఫోటోలను కూడా విడుదల చేయగా పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

మ‌రో వైపు హాట్ అందాలు ఆరబోసే రంగ‌మ‌త్త‌ను ఇలా చేశారేంటి అంటూ ఆమె అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు. ఇక సినిమాలో మరో విల‌న్ గా నటిస్తున్న సునీల్ లుక్ సైతం భ‌యంక‌రంగానే ఉంది. మంగళం శ్రీను గా సునీల్ ఇది వ‌ర‌కూ క‌నిపించ‌ని గెట‌ప్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఎవ‌రూ ఊహించని లుక్ ల‌లో న‌టీన‌టుల‌ను చూపిస్తున్న సుకుమార్ ఈ సినిమాతో ఎలాంటి విజయం అనుకుంటాడో చూడాలి.

Visitors Are Also Reading