ఇండస్ట్రీలోకి మెజీషియన్ గా అడుగుపెట్టిన సుడిగాలి సుదీర్, జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న సుధీర్ గాలోడు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకొని మరింత క్రేజ్ పెంచుకున్నారు.. అయితే గత కొంతకాలం నుంచి సుధీర్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది..
Advertisement
also read:పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి నిజంగా గుండు కొట్టించారా ? ఆయన కొడుకు శ్రీరామ్ చెప్పిన సంచలన విషయాలు !
ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ అయిందని అమ్మాయి కూడా అందరికి తెలిసిన ఆవిడే అంటూ వార్తలు వస్తున్నాయి.. మరి ఇందులో నిజ నిజాలు ఏంటో చూద్దాం.. సుడిగాలి సుధీర్ ఎప్పుడు డెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురు చూసే అభిమానులకు ఇది గుడ్ న్యూస్. సుడిగాలి సుదీర్ తో ఎంగేజ్మెంట్ జరిగిన అమ్మాయి విజయవాడ కృష్ణా జిల్లాకు చెందిన అమ్మాయిగా చెబుతున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని తెలుస్తోంది. అమ్మాయి తండ్రి కూడా పెద్ద వ్యాపారవేత్తట. అయితే ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి డాక్టర్ అని సమాచారం.
Advertisement
అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఏమైనా వచ్చే 2023లో తప్పనిసరిగా సుధీర్ పెళ్లి చేసుకునేది ఖాయమని, ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ ఏది అడిగినా సినిమా తర్వాతే అన్నారట, ప్రస్తుతం సినిమా అయిపోయింది సూపర్ హిట్ కొట్టింది. ఈ శుభ సందర్భంలో కుటుంబ సభ్యులు ఒత్తిడి పెట్టడంతో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సుధీర్ ఈ విషయంపై తాను స్వయంగా ప్రకటిస్తే గాని అసలు విషయం బయటకు రాదు.
also read: