సోషల్ మీడియా ప్రభావంతో మంచి తో పాటు చెడు కూడా జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల గాలి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే గత కొన్ని నెలలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గతంలో ఓ భూ వివాదం విషయంలో దివంగత రాజకీయ నాయకుడు పరిటాల రవి గుండు కొట్టించాడు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గుండు చేసుకున్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో వైసిపి మంత్రి రోజా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Advertisement
Also Read: కాంతారా సినిమాలోని వరాహ రూపం పాటతో ఫేమస్ అయిన సింగర్ శ్రీలలిత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ ను ఈ విషయంపై యాంకర్ ప్రశ్నించారు. దాంతో పరిటాల శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ వార్తలను కొట్టి పారేశారు. పవన్ కళ్యాణ్ మంచి నటుడు…. ఆయనకు సొసైటీ మీద ఎంతో ప్రేమ ఉంది అని అన్నారు. నాయకుడు ఎదిగే క్రమంలో రూమర్లు వస్తూనే ఉంటాయని శ్రీరామ్ వ్యాఖ్యానించారు.
Also Read: ఆ మాటకు కట్టుబడి మెగాస్టార్ కోసం ఆ నిర్మాత ఎంతటి త్యాగం చేశారంటే..?
Advertisement
కేవలం ఇవి ఆరోపణలు మాత్రమే అని చెప్పారు. ఇలాంటి రూమర్లు వస్తుంటాయని ఇదంతా సర్వసాధారణం అని అన్నారు. ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉంటే వాటిపై స్పందించాలి కానీ నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఎలా స్పందిస్తామని శ్రీరామ్ అన్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి చూపించడానికి ఇలాంటి రూమర్లు క్రియేట్ చేస్తున్నారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని…. వాళ్ళు ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ను నెగిటివ్ గా చేయడానికి మాట్లాడే మాటలు తప్ప… తన తండ్రి గుండు కొట్టించారు అనే వార్తలలో అసలు నిజం లేదని శ్రీరామ్ వెల్లడించారు. అంతేకాకుండా ఇలాంటి ఆరోపణలకు పులిస్టాప్ పెట్టాలని శ్రీరామ్ వైసిపి నేతలను హెచ్చరించారు.
Advertisement
Also Read: Vadhandhi web series review in Telugu: “వదంది” రివ్యూ& రేటింగ్.. చివరి ట్విస్ట్ అదిరిపోలా..!!