Home » ఆ మాటకు కట్టుబడి మెగాస్టార్ కోసం ఆ నిర్మాత ఎంతటి త్యాగం చేశారంటే..?

ఆ మాటకు కట్టుబడి మెగాస్టార్ కోసం ఆ నిర్మాత ఎంతటి త్యాగం చేశారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు.. ఇందులో ముఖ్యంగా ఏ నిర్మాత అయినా సరే సినిమా కథ బాగుంది హిట్ అవుతుంది అనుకుంటేనే ఆ సినిమాపై పెట్టుబడి పెట్టే ఈ రోజుల్లో కేవలం చిరంజీవికి ఇచ్చిన మాట కోసం ఆ నిర్మాత ఆ సినిమా తీసి మరీ లాస్ అయ్యారు.. ఇవేవీ పట్టించుకోకుండా మాట కోసమే కట్టుబడి ఉన్న నిర్మాత ఎవరో కాదు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతల్లో మంచి పేరుగాంచిన శ్యాం ప్రసాద్ రెడ్డి. ఆయన ఇప్పటికే ఎన్నో అగ్ర సినిమాలు తీసినప్పటికీ బయటకు మాత్రం అంత ఫోకస్ కారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆలోచనతో మాటకు కట్టుబడే మనిషి.

Advertisement

also read:Matti kusthi review: మట్టి కుస్తీ మూవీ రివ్యూ& రేటింగ్..!!

ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడంలో కాస్త డిఫరెంట్ స్టైల్లో ఆలోచిస్తున్నారు. కథ బాగుంటే ఆలస్యమైనా సరే మంచి సినిమాలు తీసి హిట్ కొడుతున్నారు. అయితే శ్యాం ప్రసాద్ రెడ్డి అంజి సినిమా చేయడం వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఆయనను ఈ సినిమా అనేక ఇబ్బందుల పాలు చేసినా కానీ ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నారు. మరి ఆ కథ ఏంటో చూద్దాం.. శ్యాం ప్రసాద్ రెడ్డికి చిరంజీవితో మంచి స్నేహపూర్వకమైన అనుబంధం ఉంది. కోడి రామకృష్ణ డైరెక్షన్లో ఎన్నో సినిమాలు చేసిన శ్యాం ప్రసాద్ రెడ్డి, కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవితో ఒక సినిమా చేయాలని బలమైన కోరిక ఉండేదట. దీనికోసం ఎన్నో మంచి కథలు గురించి కోడి రామకృష్ణ తో మాట్లాడారు.

Advertisement

కానీ చిరంజీవితో డేట్స్ అడ్జస్ట్ అవ్వక, కోడి రామకృష్ణ ఇంటికి డైరెక్ట్ గా వెళ్లి శ్యాం ప్రసాద్ రెడ్డి గ్రాఫిక్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని అడిగారట. ఈ క్రమంలో కోడి రామకృష్ణ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, సమయం చాలా ఎక్కువ పడుతుంది అని చెప్పినా వినకుండా సినిమా చేయాలన్నారట. అంజి సినిమా అస్సలు వద్దని వారించిన కానీ శ్యాం ప్రసాద్ రెడ్డి వినకుండా చిరంజీవికి మాట ఇచ్చానని ఎంత ఖర్చైనా వెనక్కి వెళ్ళేది లేదని అంజి సినిమా మొదలుపెట్టారు. అప్పట్లో గ్రాఫిక్స్ కోసం విదేశాలనుంచి నిపుణులను కూడా పిలిపించారు. సినిమా మొత్తం బాగానే ఉన్నప్పటికీ చిరంజీవిని ఆ విధంగా చూసేసరికి ఫ్యాన్స్ కు నచ్చలేదు. చివరికి ఈ సినిమా ఫ్లాప్ అయింది.

also read:Vadhandhi web series review in Telugu: “వదంది” రివ్యూ& రేటింగ్.. చివరి ట్విస్ట్ అదిరిపోలా..!!

Visitors Are Also Reading