తెలుగు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి పింకీ గా పేరు పొందిన నటి సుదీప.. చాలామంది సుదీప అంటే ఎవరు అని అంటారు.. కానీ పింకీ అని చెబితే తప్పనిసరిగా గుర్తుపడతారు. అలాంటి సుదీప పింకీ బిగ్బాస్ 6 లో తనదైన శైలిలో పర్ఫామెన్స్ ఇచ్చి ఇటీవలే ఎలిమినేట్ అయింది.. కానీ బిగ్బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయింది సుదీప.. బయటకు వచ్చిన తర్వాత సుదీప (పింకీ) పలు ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.. తన ఫస్ట్ సినిమా ఎం ధర్మరాజు ఎంఏ, రచయిత వేమూరి సత్యనారాయణతో మా తాత గారికి చాలా పరిచయం ఉంది. అయితే ఈ మూవీ కోసం చెన్నై నుంచి ఒక అమ్మాయిని ఇక్కడికి తీసుకు వస్తే అమ్మాయి టైంకు సినిమాలో చేయనని చెప్పేసింది.
Advertisement
also read:Biggboss:కీర్తి భట్ విషయంలో భారీ మార్పు చేసిన నాగార్జున.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
Advertisement
అయితే ఈ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతూ ఉంటే అది చూడడానికి మా తాతయ్య వెళ్ళినప్పుడు మా మనవరాలికి ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా పాత్ర ఉంటే చెప్పండి అని అడిగారు. ఈ క్రమంలోనే చెన్నై అమ్మాయి హ్యాండ్ ఇవ్వడంతో నన్ను ఈ సినిమా లోకి తీసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయింది. సెవెన్ జి బృందావన కాలనీ కోసం నల్లగా ఉండాలి, చాలా సన్నబడాలి అన్నారు. దానికోసం రోజూ గంట సేపు ఎండలో నిలబడేదాన్ని. ఇక దీని తర్వాత ఉదయ్కిరణ్ తొమ్మిది సినిమాలు ఒకేసారి మొదలయ్యాయి. అందులో ఐదు సినిమాలకు నేను సంతకం చేశాను. కానీ ఆ చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఉదయ్ కిరణ్ గురించి చెబుతూ అతడు చాలా సాఫ్ట్ గా ఉండే వారు..
కానీ మనం డల్ గా కనిపిస్తే మాత్రం వెంటనే వచ్చి ఏమైంది.. ఏం జరిగింది.. ఏంటి అలా ఉన్నావ్..ఏమైనా ఇబ్బందా అని అడిగే మంచి మనస్తత్వం అని తెలియజేసింది. మనిషి సంతోషాన్ని పంచుకొకపోయినా, బాధను పసిగట్టి ఓదార్చే మనిషి ఉదయ్ కిరణ్ అని చెప్పింది. తనతో నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉండేదని తెలియజేసింది.ఆ హీరోతో నేను చేసిన చివరి చిత్రం వియ్యాలవారి కయ్యాలు.. పాపం ఏ కష్టమొచ్చిందో ఏమో ఆత్మహత్య చేసుకొని అందరిని వదిలేసి వెళ్లిన ఇప్పటికీ చాలా మంది అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అంటూ ఎమోషనల్ అయ్యింది సుదీప (పింకీ)..
also read: