Home » Biggboss:కీర్తి భట్ విషయంలో భారీ మార్పు చేసిన నాగార్జున.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

Biggboss:కీర్తి భట్ విషయంలో భారీ మార్పు చేసిన నాగార్జున.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి శనివారం నాగార్జున హౌస్ లో జరిగిన విషయాలపై చర్చించి వారు చేసిన తప్పులపై ప్రశ్నిస్తారు. ఈసారి నాగార్జున కీర్తి విషయంలో ఒక విషయాన్ని బయటపెట్టారు. గత కొన్ని రోజులుగా కీర్తి పర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. అప్పటికీ నాగార్జున మాత్రం సరైన ఇంప్రెషన్ ఇవ్వడం లేదు. ఎంత బాగా ఆడిన ఆడలేదని నాగార్జున అంటున్నాడు. అలాగే ఆడియన్స్ దగ్గరనుంచి చెప్పిస్తున్నాడు. కానీ ఈ వారంలో కీర్తి భట్ రాములమ్మ పాత్ర వేసింది. కీర్తి కి అసలు తెలుగు రాదు. తెలుగు సినిమాలు చూడ్డమే తక్కువ.

Advertisement

also read:తన కంటే 20 ఏళ్ల చిన్నోడితో షకీలా లవ్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

అవి కూడా లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే చూస్తుంది. కానీ విజయశాంతి నటించిన రాములమ్మ సినిమా అనేది చాలా పాతకాలం సినిమా. ఆ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ను తీసుకొని చాలా బాగా పర్ఫామెన్స్ చేసింది కీర్తి. అయినా కూడా నాగార్జున నీ పర్ఫామెన్స్ ఎలా ఉంది కీర్తి అని అడిగితే సార్ నాకు ఆ సినిమా తెలియదు, దాంట్లో విజయశాంతి యాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, నేను ఇక్కడ కొంత మంది చెప్పినా ఇన్ పుట్స్ తీసుకొని చేయడానికి ప్రయత్నం చేశాను. అంతేకాకుండా నా క్యారెక్టర్ లో కామెడీ చేయడానికి లేదు.

Advertisement

నా వంతుగా ఆ క్యారెక్టర్ కు న్యాయం చేయడానికి ట్రై చేశాను సార్ అంటూ చెప్పింది. దీని పై నాగార్జున ఏమన్నాడంటే.. 100% ట్రై చేసావు.. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. నువ్వు చాలా బాగా నటించావు కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని, నీ టాలెంట్ ఇది కాదు ఇంకా ఉంది అంటూ చెబుతాడు. దీనికి కీర్తి ఓకే సార్ అని చెబుతుంది. కీర్తి హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి నాగార్జున ఎప్పుడు కూడా కీర్తిని మెచ్చుకో లేదు. కానీ ఈ వారం మాత్రం నాగార్జున ఆమెను కాస్త అప్రిషియేట్ చేశారని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading