Telugu News » Blog » పెళ్లి సమయంలో రాజీవ్ కనకాల సుమకు అలాంటి కండిషన్ పెట్టారా..?

పెళ్లి సమయంలో రాజీవ్ కనకాల సుమకు అలాంటి కండిషన్ పెట్టారా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ యాంకర్లలో సుమా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఆమె మలయాళీ అయినా కానీ తెలుగులో స్పష్టంగా అచ్చతెలుగు అమ్మాయిల అందరితో కలిసిపోతుంది. ఓవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే మరోవైపు ఫంక్షన్లు ఇతర షోలు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది.

Advertisement

anchor-suma

అయితే ఆమె ఈమధ్య ఎందుకో మాటలను మాట్లాడే ముందు ఆలోచించడం లేదని అనిపిస్తోంది. ఆమె మాటల వల్ల హీరోలు అయోమయంలో పడిపోవాల్సిన పరిస్థితి ఎదురైతోంది. తాజాగా కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ ను తన 30వ సినిమా అప్డేట్ ఇవ్వమని సుమా అందరి ముందు వేదిక పైన అడిగేసింది.

Advertisement

దీంతో ఎన్టీఆర్ అసహనంగా ఫీల్ అయినట్టు కనిపిస్తోంది. ఫ్యాన్స్ అడగకుండా మీరే చెప్పించేలా ఉన్నారు అంటూ చురకలంటించారు. అలాగే మరో ఫంక్షన్ లోనూ ఇలాగే మాట్లాడి హీరోని ఇబ్బంది కి గురిచేసింది.. కట్ చేస్తే సుమ గతంలో ఒకసారి పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త రాజీవ్ కనకాలతో ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. మా ప్రేమ ప్రయాణం 1994 సంవత్సరంలో మొదలైంది. మొదట రాజీవ్ ప్రపోజ్ చేశాడు. సుమ రిజెక్ట్ చేసిందట.తర్వాత ఓకే చేసింది.

ఈ టైంలోనే రాజీవ్ కనకాల ఒక కండిషన్ పెట్టారట. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేయాలని అన్నారట. దాంతో సుమ పెళ్లి చేసుకోను అని రాజీవ్ తో సంవత్సర కాలం పాటు మాట్లాడలేదు. ఆ టైంలో రెండు మూడు సినిమాలు చేసింది అయితే అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో సినిమా రంగం నచ్చలేదని సినిమానే వదిలేసింది. ఆ తర్వాత రాజీవ్ తో మాట్లాడి తమ ప్రేమ గురించి రాజు తండ్రి దేవదాసు కనకాలతో మాట్లాడి 1999 లో పెళ్లి చేసుకున్నారు.

Advertisement

also read:

You may also like