అప్పుడప్పుడు కొన్ని ఘటనలు చూస్తే మనం ఏ సమాజంలో ఉన్నామని ఆలోచన వస్తుంది.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే అనాలోచిత సంఘటనలకు పాల్పడితే ఇక వారికి చెప్పేది ఎవరు.. అడ్డుకునేదెవరు.. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.. రూల్స్ పేరుతో విద్యార్థినులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు బయటకు వస్తున్నాయి.. అలాంటిదే ఇది.. ఓ టీచర్ అనాలోచిత నిర్ణయం వల్ల ఒక విద్యార్థిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడింది. పరీక్షల్లో కాపీ కొడుతోందని అనుమానంతో టీచర్ చేసిన పని ఆ విద్యార్థిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.
Advertisement
also read:ఎన్టీఆర్ కొరటాల సినిమా కథ లీక్…? ఈ చిత్రంలో హైలెట్ అదేనట..!
Advertisement
దీంతో సదరు అమ్మాయి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ లో జరిగింది.. అసలు విషయం ఏంటంటే.. జంషెడ్ పూర్ కు చెందిన 9వ తరగతి చదువుతున్నటువంటి ఓ విద్యార్థిని ఇటీవల పరీక్షలకు హాజరైంది. ఈ క్రమంలోని ఇన్విజిలేటర్ గా ఉన్నటువంటి టీచర్ ఆ బాలిక కాపీ చేస్తోందని అనుమానంతో పక్కనే ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లి బట్టలు విప్పించింది. ఆ బాలిక ఎంత బ్రతిమిలాడిన ఆ టీచర్ మాత్రం కనికరించలేదు. దీంతో ఆ బాలిక మనస్తాపం చెంది తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నేరుగా ఇంటికి వెళ్లి ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నం చేసింది..
ఇది గమనించిన బాలిక కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక ఎక్కువగా కాలిపోవడంతో చావు బతుకుల మధ్య ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై మాత్రం పాఠశాల యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు కారకులైన టీచర్ ను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
also read: